మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 10, 2020 , 02:31:08

ఉచిత న్యాయ సేవలందిస్తాం

ఉచిత న్యాయ సేవలందిస్తాం

  •  న్యాయ విజ్ఞాన సదస్సులో 9వ అదనపు జిల్లా జడ్జి జాన్సన్‌

సిరిసిల్ల లీగల్‌: నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలందిస్తున్నామని సిరిసిల్ల మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్‌, 9వ అదనపు జిల్లా జడ్జి ఎం జాన్సన్‌ పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిసిల్ల కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ, అర్టికల్‌ 39ఏ ప్రకారం పేదలకు ఉచితంగా న్యాయం అందించడానికి న్యాయ సేవా సంస్థ చట్టాన్ని 1987 నవంబర్‌ 9న ఏర్పాటు చేశామన్నారు. ఉచిత న్యాయ సాయానికి గల అర్హతలు, పొందే విధానాన్ని వివరించామని తెలిపారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పారా లీగల్‌ వలంటీర్లను నియమించి గ్రామాల్లో లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో జూనియర్‌ సివిల్‌ జడ్జిలు శంకరశ్రీదేవి, మంజుల, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు ఉన్నారు.