సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Mar 03, 2020 , 01:53:15

పరిశీలిస్తూ.. సూచనలిస్తూ..

పరిశీలిస్తూ.. సూచనలిస్తూ..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని హరిదాస్‌ నగర్‌ గ్రామంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కలియదిరిగారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి గ్రామ పంచాయతీలో ఆయన బస చేశారు. తిరిగి సోమవారం ఉదయమే గ్రామంలోని వీధివీధినా క లియదిరిగారు. గ్రామంలో చేపట్టిన ముఖ్యమైన ప నులను జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావుతో కలిసి క్షేత్రస్తాయిలో పరిశీలించారు. అధికారులు సైతం ఉదయా న్నే గ్రామానికి చేరుకుని కలెక్టర్‌తో కలిసి పలు వీ ధుల్లో స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించారు. మొ దట గ్రామపంచాయతీ పక్కనే ఉన్న దళితవాడల్లో సీసీరోడ్లు, రోడ్డుకిరువైపుల మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం బీసీ కాలనీలో దాదాపు కిలోమీటర్‌ వరకు కాలికడకన వెళ్లి హరితహారంలో భాగంగా రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. వాటి సంరక్షణపై సంతృప్తిని వ్యక్తంచేశారు. అక్కడ నుంచి తనవాహనంలో గట్టుమల్లన్న ఆలయం వద్దకు చేరుకుకున్నారు. యాదవ సం ఘం సభ్యులు ఆలయ పరిసరాల్లో నాటిన పండ్ల మొక్కలను పరిశీలించారు. మల్లన్న పట్నాల కార్యక్రమంలో నిమగ్నమయిన యాదవ సంఘం సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు. గ్రామంలో జరిగిన పనులపై ఆరా తీశారు. అనంతరం మల్లన్నదేవునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుపూజారులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం శ్మశానవాటిక, డంప్‌యార్డు పనులను తొందరగా ప్రారంభించాలని ఆదేశించారు. నర్సరీ నిర్వహణ తీరుపై అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు ఏ మొక్కలను కోరుకుంటున్నారో, ఆ మొక్కలనే నర్సరీల్లో పెంచాలని సూచించారు. కలెక్టర్‌ గ్రా మంలోనే బసచేసిన విషయం తెలుసుకున్న పలువు రు గ్రామస్తులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. 

వార్షిక ప్రణాళిక ఆవిష్కరణ

 జిల్లాకు సంబంధించిన పొటెన్షియల్‌ లింక్డ్‌ ప్లాన్‌(పిఎల్‌పి) వార్షిక ప్రణాళికను కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆవిష్కరించారు. 2020-21కి సంబంధించి రూ.1700.49 కోట్లుగా వార్షిక ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రణాళికలో వ్య వసాయ రంగానికి పెద్దపీట వేశామని, ఏకంగా రూ. 1182.69 కోట్లు, ఎంఎస్‌ఎంఈకిగాను 278. 21 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, నాబార్డ్‌ డీడీఎం అనంత్‌, ఎల్డీఎం రంగారెడ్డి, ఆంధ్రాబ్యాం కు చీఫ్‌ మేనేజర్‌ రాఘవులు, టీజీబీ మేనేజర్‌ వీర య్య, ఎస్‌బీఐ మేనేజర్‌ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. 


కొండెంగతో కొద్దిసేపు..

హరిదాస్‌నగర్‌లో పల్లెనిద్రలో భా గంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించి, నర్సరీ గురించి వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో అక్కడే జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు ఇంటివద్ద ఉన్న కొండముచ్చును కలెక్టర్‌ గమనించారు. లక్ష్మణ్‌రావు సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామంలో కోతుల బెడదను నివారిం చడంలో భాగంగా కొండముచ్చును తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొండముచ్చును గ్రామస్తులు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు చూపించగా దానికి ఆహారం అం దించి కొద్దిసేపు గడిపారు. పల్లెనిద్రలో కలెక్టర్‌ వెంట డీపీవో రవీందర్‌, డీపీఆర్‌వో దశరథం, ఎంపీడీవో చిరంజీవి, తాసిల్దారు శ్రీకాంత్‌, సెస్‌డైరెక్టర్‌ కుం బాల మల్లారెడ్డి, సర్పంచ్‌ తెడ్డు అ మృ త, ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ జంగిటి సత్తయ్య, నాయకులు ఎల్లయ్య, నాగరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo