Ganesh Immersion : వినాయక చవితి పర్వదినం నుంచి పూజలందుకుంటున్న గణపయ్యలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరారు. శుక్రవారం ఖైరతాబాద్ ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ నిమజ్జనంతో హైదరాబాద్‌లోని దారులన్నీ కోలాహలంగా మారాయి.
నవరాత్రుల్లో భాగంగా తమ గల్లీల్లో, ఇంట్లో విఘ్నేశ్వరుడిని పూజించిన వారంతా మధ్యాహ్నం నుంచి హుషారుగా నిమజ్జనం వేడుకలో చిందేశారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై.. బై బై గణేశ’ అంటూ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌కు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జన సంద్రాన్ని తలపించింది.













