గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Oct 28, 2020 , 01:06:31

అవినీతిని నిర్మూలించాలి

అవినీతిని నిర్మూలించాలి

ఆర్జీ-1 జీఎం కే నారాయణ 

గనులు, డిపార్ట్‌మెంట్లలో విజిలెన్స్‌ వారోత్సవాలు.. 

గోదావరిఖని: అవినీతిని నిర్మూలించాలని, అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఆర్జీ-1 జీఎం కే నారాయణ అభిప్రాయపడ్డారు. ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గను లు, డిపార్ట్‌మెంట్లలో విజిలెన్స్‌ వారోత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా జీఎం తన కార్యాలయంలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో 1987వ సంవత్సరం నుంచి ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ విభాగ వారోత్సవాలను ఏటా అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణిలో అవినీతికి తావులేకుండా ప్రతి ఉద్యోగి నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం త్యాగరాజు, ఏరియా ఇంజినీర్‌ బెంజ్‌మెన్‌, సేఫ్టీ ఆఫీసర్‌ కేవీ రావు, డీజీఎం ఆంజనేయులు, పర్సనల్‌ మేనేజర్‌ రమేశ్‌, ప్రవీణ్‌, అంజనీప్రసాద్‌, సమ్మయ్య, సలీం, సారంగపాణి తదితరులున్నారు.

ఆర్జీ-2లో.. 

యైటింక్లయిన్‌ కాలనీ: ఆర్జీ-2 ఏరియాలో విజిలెన్స్‌ వారోత్సవాలను జీఎం ఎం సురేశ్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంతోపాటు అన్ని గనులు, డిపార్టమెంట్లపై ఉద్యోగులతో విజిలెన్స్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జీఎం సురేశ్‌ మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతో వృత్తి ధర్మాన్ని పాటించాలని చెప్పారు. సింగరేణిలో అధికారులు అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం సాంబయ్య, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, అధికారులు ఉన్నారు. 

ఎన్టీపీసీలో..

జ్యోతినగర్‌: రామగుండం ఎన్టీపీసీలో విజిలెన్స్‌ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎన్టీపీసీ పరిపాలనా భవనంలో జరిగిన వేడుకలకు సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై అవినీతిరహిత సేవలకు కట్టుబడి ఉంటామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఎన్టీపీసీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్సీ జీఎం ఏకే నమయార్‌, సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, డీజీఎం(విజిలెన్స్‌) కామిల్‌ అలీఖాన్‌తో ప్రతిజ్ఞ చేయించారు.  


అవినీతికి అవకాశం లేకుండా చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సింగరేణి సంస్థలో అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి జనరల్‌ మేనేజర్‌ (సీడీఎస్‌) కే రవిశంకర్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో విజిలెన్స్‌ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు.  ఈ సందర్భంగా సీనియర్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ గుణశంకర్‌ ఉద్యోగులతో విజిలెన్స్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఎన్‌ భాస్కర్‌, డీజీఎంలు విజేందర్‌రెడ్డి, తాడబోయిన శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌, హరిప్రసాద్‌, అరవింద్‌, భద్రు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.