బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 03, 2020 , 02:24:29

లాభాల బాట పట్టించాలి

లాభాల బాట పట్టించాలి

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ ఉద్యోగులను కంటికి రెప్పలా కపాడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్‌లో గోదావరిఖని నుంచి కరీంనగర్‌కు నాన్‌స్టాప్‌ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందన్నారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు గోదావరిఖని నుంచి కరీంనగర్‌కు నాన్‌స్టాప్‌ బస్సులు ప్రారంభించినట్లు చెప్పారు. గోదావరిఖని బస్‌డిపోను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్సులో టికెట్‌ తీసుకొని ప్రయాణం చేసారు. డీఎం వెంకటేశ్వర్‌రావు, కార్పొరేటర్లు పులేందర్‌, శ్రీనివాస్‌, కొంరయ్య పాల్గొన్నారు. 


logo