ప్రపంచ వెదురు దినోత్సవాన్ని సెప్టెం బర్ 18న జరుపుకొంటున్నాం. వెదురుకు ‘ఆకుపచ్చ బంగారం’ అనే మరో పేరున్నది. దీనిపై ఆధారపడే మేదరులు తమ బతుకును వెళ్లదీస్తారు. అయితే, మేదర కులం ఒకటి ఉన్నదనే విషయం కూడా చాలామందికి తెలియకపోవడం విచారకరం.
సహజంగా ప్రాంతాల్లో లభించే సేకరించి దానితో చాటలు, బుట్టలు, గంపలు, మొంటెలు, తడకలు, నిచ్చెనలు, గుమ్ములు, విసనకర్రలు, జల్లెడలు, కోళ్ల గంపలు మొదలైన వస్తువులను మేదరులు కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఇదొక ఇంజినీరింగ్ వెదురుతో తయారుచేసే వస్తువులన్నీ పర్యావరణహితమే. గతంలో గృహోపకరణాలు, వ్యవసాయానికి కావలసిన వస్తువులు తయారుచేసినవే వాడేవారు. కానీ, ప్లాస్టిక్ కారణంగా ఈ వృత్తికి, వెదురు వస్తువులకు డిమాండ్ తగ్గిపోయింది. ముడిసరుకైన వెదురు కూడా లభించడం అందుకే, మేదరులు ఈ వృత్తికి దూరమై అడ్డా కూలీ, ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మేదర వృత్తి కనుమరుగైపోవడం ఖాయం. వెదురు చెట్టుకాదు, అదొక గడ్డి జాతి మొక. ఈ మేరకు 1926 అటవీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించి, వెదురు నరకడంపై ఉన్న నిషేధాన్ని సడలించింది. కానీ, అధికారులు మాత్రం మేదరులను ఇప్పటికీ దొంగలుగానే పరిగణిస్తున్నారు. అడవి తల్లే జీవనాధారంగా బతుకుతున్న మేదరులు దేశమంతటా ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నారు. కానీ, తెలంగాణ, ఏపీలో మాత్రమే వీరు బీసీలు కావడం గమనార్హం. కాబట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుబడిన వీరిని ఆయా ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. ముఖ్యంగా లనే ఉపయెగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. మేదర వృత్తి కనుమరగువుతున్న నేపథ్యంలో కులవృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
(నేడు ప్రపంచ వెదురు దినోత్సవం)
-జొర్రీగల శ్రీనివాస్
(మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)