అది తెలంగాణకు సరిహద్దు అయిన ‘హైదరాబాద్ కర్ణాటక’(కల్యాణ్ కర్ణాటక) ప్రాంతం, సుమారు కోటి మందికి పైగా జనాభా. కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయచూరు, కొప్పాల్, బళ్ళారి జిల్లాలు ఈ ప్రాంతానికి చెందినవే. 37 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. జహీరాబాద్ నియోజకవర్గానికి సమీపంలో గల చించోలి నియోజకవర్గం శివరాంపురంలోని లింగాయత్ సమాజం నాయకుడి ఇంటికి ఆత్మీయంగా పలకరిద్దామని వెళ్లాం. మేం తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నాయకులమని వారికి అప్పటికే తెలిసింది.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి అక్కడి ప్రజల ఆసక్తి మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. లింగాయత్ సమాజ్ నాయకుడైన ఉమాపతి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాల మీద వివరంగా మాట్లాడారు.ఉమాకాంత్ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది.అక్కడి ప్రజల గుండె లోతుల్లో కేసీఆర్ స్థానం ఏమిటో తెలిసింది.
మేం అక్కడ పర్యటిస్తున్న వార్తను ఉమాపతి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీంతో చుట్టుపక్క ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు పార్టీ ప్రచారం కోసం తిరుగుతున్నారనే వార్త వ్యాపించింది. పక్క జిల్లాలైన గుల్బర్గా, యాద్గిర్ ప్రాంతాల నుంచి మా బృంద సభ్యుడైన అక్బర్ హుస్సేన్‌కు ఫోన్ల తాకిడి ఎక్కువైపోయింది.ఉమాపతి స్టేటస్ ద్వారా మా ప్రయాణం పూర్తిగా రాజకీయపరమైపోయింది.
ఈ ఐదు రోజుల పర్యటనలో సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాం. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక సరికొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉన్నదని, యావద్భారతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, త్వరలోనే దేశ్ కీ నేతగా కేసీఆర్ రూపాంతరం చెందుతారని మాకు అర్థమైంది.
కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఈ భూభాగం ఎన్నో పోరాటాలకు నిలయం అని, ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి నాయకులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేశారని, ఆ ఉద్యమస్ఫూర్తితోనే కల్యాణ కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ బోర్డు (కేకేఈఆర్డీబీ) ఏర్పాటైందని ఉమాపతి చెప్పారు. కర్ణాటక రాజకీయాల్లో కొత్తగా జాతీయపార్టీ రూపంలో అడుగు పెట్టిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇక్కడ ఎన్నికల్లో పాలు పంచుకోవాలంటూ ఆయన తన మనసులోని భావాలను పంచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది కాబట్టి, ప్రస్తుతం కర్ణాటక జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.
రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ సరైన అవకాశం కల్పిస్తే ఆ పార్టీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. ఇక్కడ కూడా లోకల్, నాన్‌లోకల్ అనే అంశం బాగా ప్రభావితం చేస్తుందని, స్థానికేతరులు గెలువగానే అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రాంతీయ అస్తిత్వానికి, స్థానిక అంశాలకు పేరుగాంచిన తెలంగాణ ఉద్యమంలో వికసించిన బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని, కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నాయకత్వంలోని జనతాదళ్ (ఎస్)తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నందున ఉమాపతి మాటలు మాకు మరింత నమ్మకాన్ని కలిగించాయి.
హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి నాయకుడైన విక్రమ్ పటేల్‌ను కలువాలని ఉమాపతి సూచించారు. విక్రమ్ పటేల్ కుటుంబ సభ్యుల్లో ఒకరైన గౌతమ్ పటేల్ డీసీసీబీ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరి నాన్న గారైన వైద్యనాథ్ పాటిల్ హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి వ్యవస్థాపకులు. కానీ గౌతమ్ పటేల్ అందుబాటులో లేరు. మేం అక్కడ పర్యటిస్తున్న వార్తను ఉమాపతి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు పార్టీ ప్రచారం కోసం తిరుగుతున్నారనే వార్త వ్యాపించింది. పక్క జిల్లాలైన గుల్బర్గా, యాద్గిర్ ప్రాంతాల నుంచి మా బృంద సభ్యుడైన అక్బర్ హుస్సేన్‌కు ఫోన్ల తాకిడి ఎక్కువైపోయింది. ఉమాపతి స్టేటస్ ద్వారా మా ప్రయాణం పూర్తిగా రాజకీయపరమై పోయింది.మేం మిగతా నియోజకవర్గాలకు వెళ్లవలసిన అనివార్యత ఏర్పడింది. ఈ గ్రామం నుంచి బయల్దేరి చించోలి, సేడం ప్రాంతాల మీదుగా యాద్గిర్ జిల్లాకు చేరుకున్నాం. అక్కడ అక్బర్ హుస్సేన్ మిత్రులైన జయప్రకాష్ మా కోసం ఎదురుచూస్తున్నారు.
వీరు మాజీ మండల అధ్యక్షులు. ఆయన తన మిత్ర బృందంతో సుమారు 10 మంది రాజకీయ నాయకులతో అక్కడ నిరీక్షించడం చూస్తుంటే బీఆర్ఎస్పై అభిమానం ఎంతున్నదో అర్థమైంది. అక్కడ ఒకనాటి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడైన రాజశేఖర్‌గౌడ్ ఇంటికి మేం చేరుకున్నాం. ఆయన యువ నాయకుడు. కేసీఆర్ అవకాశం ఇస్తే తప్పకుండా ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. తాను ఈ జిల్లాలో భారీ బహిరంగసభ పెడుతానని కూడా అన్నారు. రాయచూర్, గురుమిట్కల్, గుల్బర్గా , బళ్ళారి, సేడం తదితర సరిహద్దు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఉన్న అవకాశాలను వివరించారు. ఇక్కడి ప్రజలు తెలుగు బాగా మాట్లాడుతారని ఇది బీఆర్ఎస్ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బంగారప్ప కుటుంబాన్ని బీఆర్ఎస్కు ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు.
బంగారప్ప కుటుంబంతో రాజశేఖర్‌గౌడ్ కుటుంబానికి సంబంధ బాంధవ్యాలున్నాయి. బంగారప్ప కుమారుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు మధు బంగారప్పను సంప్రదించి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేయిస్తానని అన్నారు. సేడం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశావహులున్నారని, రాయచూర్‌లో సుమారు ముగ్గురు ఎమ్మెల్యే ఆశావహులు బీఆర్ఎస్కు పనిచేసే అవకాశం ఉందన్నారు. యాద్గిర్లో 75 శాతం ఓడిగిర తాలూకా ప్రాంతం అయినందున ఇక్కడ బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉందన్నారు. సేడం ప్రాంతం లో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నదని, ఇది బీఆర్ఎస్కు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ మిత్ర పార్టీ ఎంఐఎం సహకారం లాభిస్తుందని విశ్లేషించారు. ఈ నాలుగు జిల్లాల్లో కనీసం 6 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే వ్యవహార శైలి వల్ల చిత్తాపూర్ నియోజకవర్గంలోని ఆశావహ అభ్యర్థులు బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతారన్నారు. షాపూర్, సురపూర్, గురుమిట్కల్, యాద్గిర్ రూరల్లలోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన క్లుప్తంగా విశ్లేషించారు. ఆయన మాటల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానం ఎంతో మాకు అర్థమైంది. బీఆర్ఎస్ కోసం రాష్ట్రమంతా పనిచేస్తామని, ఇక్కడ తెలుగువారి సహకారం బీఆర్ఎస్ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
మరో ముఖ్య నాయకుడు మలక్రెడ్డి అనుచరులు మాకు ఫోన్ చేశారు. మలక్రెడ్డి ఎంతో ప్రభావం చూపే సీనియర్ రాజకీయవేత్త. వీరు కర్ణాటకలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేను గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడంలో మలక్రెడ్డిది క్రియాశీలక పాత్ర. ప్రస్తుతం మలక్రెడ్డి బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉన్నదని ఆయన అనుచరులు చెప్పారు. ఇలా.. ఒక్కో నియోజకవర్గంలో ప్రాంతపరంగా, స్థానిక అంశాలపరంగా, కుల, రాజకీయపరమైన వివిధ అంశాలు బీఆర్ఎస్ ఎదుగుదల కోసం ఎంతో సహకరిస్తాయని మాకు అర్థమైంది. అక్కడినుంచి బయల్దేరిన మా బృందం బీదర్ జిల్లాకు చేరుకున్నది. బీదర్ పట్టణంలో వ్యాపారవేత్త, మైనారిటీ నాయకుడు మహమ్మద్ హైమద్ దగ్గరికి వెళ్లాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మత సామరస్యం కాపాడుతున్నారని ఆయన కొనియాడారు. బీదర్ జిల్లాలోని ఔరాద్, బసవ కల్యాణ్, హుమ్నాబాద్, బాల్కీ నియోజకవర్గాల్లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషించారు. ఈ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్ కుటుంబసభ్యుడైన చందర్సింగ్ను బీఆర్ఎస్లోకి తీసుకురావాలని సూచించారు. మరో మైనారిటీ నాయకుడు ఫెరో జ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్, బీజేపీలతో విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు.
ఇప్పటి పరిస్థితి ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని అన్నారు. బీఆర్ఎస్ విధానాలతో కేసీఆర్ ఇక్కడి రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, ఆదివాసీలకు, యువతకు, మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన భాగ్యపురుషుడు అవుతారని ఆయన అభిప్రాయ పడ్డారు. బీఆర్ఎస్ విధి విధానాలు మ్యానిఫెస్టో రూపంగా మారితే మాకు ఎంతో ఉపయోగపడతాయని మరో యువరైతు భరత్‌రెడ్డి అన్నారు. ఈ 5 రోజుల పర్యటనలో సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాం. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక సరికొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉన్నదని, యావద్భారతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, త్వరలోనే దేశ్ కీ నేతగా కేసీఆర్ రూపాంతరం చెందుతారని మాకు అర్థమైంది.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’
నినాదాన్ని యావత్ దేశ ప్రజలు, రైతులు, మేధావులు, సమస్త బుద్ధిజీవులు గుర్తించారని తేటతెల్లమైంది. బీఆర్ఎస్ దేశ ప్రజలకు ఒక ఆశా కిరణం. అపర చాణక్యుడిగా, మేధావిగా, భగీరథుడిగా కేసీఆర్‌ను ఈ దేశ వాసులు హృదయానికి హత్తుకుంటారని
స్పష్టమైంది.
జై బీఆర్ఎస్! జై కేసీఆర్!!(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
-డి.లక్ష్మారెడ్డి
94400 15510