తెలంగాణ బీజేపీకి తాజా ట్యాగ్‌లైన్ అధ్యక్షుడి మార్పు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్‌ను నియమించబోతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు బండి సంజయ్‌కి కూడా సమాచారం ఇవ్వడంతో ఆయన ఆఫీసు ఛాయలకు కూడా రావడం లేదని, ఖమ్మంలో జరిగే అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను పట్టించుకోవడం లేదని ఆ పార్టీలో ప్రచారం జరిగింది. బండి సంజయ్ కినుక, కొత్త అధ్యక్షుడి నియామకంపై ఊగిసలాట, కర్ణాటక ఫలితాల ప్రభావం తదితర కారణాల వల్ల తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయినట్టు అధిష్ఠానానికి సమాచారం అందడం వల్లనే ఎన్నికల వరకు బండి సంజయే కొనసాగుతారని పార్టీ రాష్ట్ర ఇంచార్జీ బన్సాల్‌తో తాజాగా ప్రకటన చేయించినట్టు చెప్తున్నారు. అయినప్పటికీ అధ్యక్షుడి మార్పు వచ్చే నెలలో కచ్చితంగా ఉంటుందని బండి వ్యతిరేక శిబిరం గట్టి నమ్మకంగా ఉన్నది.