పాట్నా: బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar).. ఇవాళ పాట్నాలోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం కోరుతూ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన తొలుత కృష్ణభగవానుడికి పువ్వులను సమర్పించారు. జ్యోతిని వెలిగించారు. శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆలయ పూజారులు మాజీ సీఎం నితీశ్‌ను సత్కరించారు. నితీశ్ రాక సమయంలో ఇస్కాన్ ఆలయంలో సంప్రదాయ భజనలు, కీర్తనలు చేశారు.
పవిత్ర ఉత్సవం రోజున నితీశ్ ఆలయాన్ని విజిట్ చేయడం సంతోషకరమని బీహార్ విద్యాశాఖ మంత్రి మితిలేశ్ తివారీ తెలిపారు. బీహార్ ప్రజల శాంతి, సుఖం కోసం నితీశ్ ప్రార్థనలు చేసినట్లు మంత్రి తెలిపారు. పార్టీ నేత సంజయ్ జా శిరస్సుపై నితీశ్ శతారీని పెట్టడం పవిత్ర ఘటనగా అభివర్ణించారు. సాంస్కృతిక, సంప్రదాయ విలువలను కాపాడేందుకు బీహార్ సర్కారు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రతి పౌరుడి సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యం కోసం తాము ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పారు.
Patna ISKCON Temple: श्रीकृष्ण जन्माष्टमी पर मंदिर पहुंचे Nitish Kumar, की विशेष पूजा-अर्चना
श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व पर बिहार के मुख्यमंत्री नीतीश कुमार पटना स्थित इस्कॉन (ISKCON) मंदिर पहुंचे। मंदिर प्रांगण में श्रद्धालुओं ने जयकारों के साथ सीएम का स्वागत किया।… pic.twitter.com/xFboIMQ0fc
— SACH TALKS (@SachTalks) September 4, 2026