ప్రపంచ మానవ నాగరికత వికాసాల్లో సింధూ స్థానం 1924, సెప్టెంబర్ 20న ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ క్టర్ జాన్ మార్షల్ రాసిన సింధూ నాగరికత తెలిసింది. కేఎన్ వాట్స్ తదితర పరిశోధకులు, లుయిగీ పియో టెస్సిటోరి భారతదేశంలో సింధూ నదీ
Harappa | హరప్పా తవ్వకాల తొలి దశలో లభించిన పురావస్తువుల ఆధారంగా సింధూలోయ నాగరికత కాలాన్ని క్రీ.పూ.320 0-క్రీ.పూ.1900ల మధ్యకాలంగా పరిశోధకులు నిర్ణయించారు. ఈ నాగరికతకు మూలాలు బలుచిస్థాన్లో ఉన్న మెహర్గఢ్లో క్రీ.పూ.7000 సంవత్సరాల నాగరికతకు అనిపించాయి.
సింధూలోయ తవ్వకాల్లో పెద్ద వీధులతో, రక్షణ ప్రాకారాలతో చక్కని ప్రణాళికతో నిర్మించిన మూతలతో కాలువల వ్యవస్థ, ధాన్యాగారాలు, గిడ్డంగులు, పడవ ఇప్పటికీ చదువని లిపితో, బొమ్మలతో దొరికిన స్టియటైట్తో చేసిన ‘ముద్రలు’ ఆనాటి ప్రజల నాగరిక జీవనం ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేదో చెప్పే సాక్ష్యాలు.
హరప్పా నాగరికతగా తొలుత పేర్కొనబడిన ఈ పురానాగరికతలో వెలుగుచూసిన పెద్ద నగరాల్లో మొహెంజొదారో ఒకటి. 1922లో రాఖాల్దాస్ బెనర్జీ దీన్ని కనుగొన్నారు. ప్రణాళికాబద్ధమైన పురాతన నగర రో చక్కటి ధార్మిక వాడుకున్న జాడతో ప్రజా జలపంపిణీ పెద్దఎత్తున ధాన్యాగారాల ఆనవాళ్లు లభించడం వల్ల గింజలను వార్షిక వనరు గా భద్రపరిచే భవిష్యప్రణాళిక అర్థమవుతున్న ది. పాలకులకు కూడిన నిర్మిత నగరం, సాధారణ ప్రజలకు చిన్న నగరం నాటి పాలక వ్యవస్థకు నిదర్శనం. మట్టి ఇటుకలతో కట్టిన ఇళ్లు వసారాలతో, స్నానాల గదులతో బయటపడ్డాయి. మురికి కాలువలకు అనుసంధానం చేసిన వ్యక్తిగత మరుగుదొడ్లు డ్రైనేజీ వ్యవస్థనుతెలియజేస్తున్నాయి. ఇండ్లు కట్టడానికి వాడిన ఘనపు ఇటుకలు 1:2:4 నిష్పత్తిలో చక్కని కొలతలతో ఉన్నాయి. లభించిన ముద్రలు నాటి పటిష్ఠ ఆర్థిక వ్యవస్థకు గుర్తులు. అప్పటి ప్రజలు పాత్రలు, పనిముట్లు చేసినవి. అందువల్లనే నాటి కాంస్యయుగపు నాగరికతగా పేర్కొన్నారు. వీధులు ఎడ్ల బండ్లు తిరిగేంత పెద్దవిగా ఉండేవి.
దక్షిణాసియాలోనే విశిష్టమైన సంక్లిష్ట సమాజ తవ్వకాల్లో హరప్పా నాగరితను తొలిదశ (క్రీ.పూ.3300-2600), వికాస దశ (క్రీ.పూ.2600-1900), అనంతర దశ (క్రీ.పూ.1900-1700) అని విభజించారు. ఇటీవలి తవ్వకాల్లో ఘాగ్గర్ పరీవాహక ప్రాంతంలో (ఋగ్వేద సరస్వతి నదీ తీరం) భిర్రానా, గిరవద్, ఫర్మానా, రాఖీగఢీల తవ్వకాల వల్ల హరప్పా నాగరికతా కాలంక్రీ.పూ.5500 సంవత్సరాలకు వెళ్లిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఈ నాగరికత సమాజాల వల్ల ఏర్పడ్డదనే అభిప్రాయం బలపడుతున్నది. స్థిరజీవన మిగులుతో చేసిన వ్యాపారాల కోసం నిర్మించుకున్న పటిష్ఠ నగర వ్యవస్థ, వ్యాపార స్థావరాలు, రేవుల అభివృద్ధి, వస్తు సమృద్ధి, ధాన్య సమృద్ధులకు తార్కాణం. లోహ సంగ్రహణం, లోహ కర్మాగారాలు, లోహ వస్తువుల నైపుణ్యాలు, ప్రామాణికమైన కొలతల పాటింపు, పింగాణీ ద్రవ్య వాడకం, ఇట్లా పలువిధాలా ఈ నాగరికత ప్రపంచ విశిష్ట స్థానాన్ని సాధించింది.
హరప్పా నాగరిక మొహెంజొదారో, హరప్పా, గన్వేరివాలా, రాఖీగఢీ, ధోలవీర ప్రధానమైనవి. గడిచిన పురాశాస్త్రవేత్తలు కాలీబంగన్, ఫర్మానా, రాఖీగఢీ, సనౌలి వంటి ఎన్నో సమాధుల స్థలాలను అన్వేషించారు. ఈ ప్రదేశాల నుంచి సేకరించిన సమాచారం ఇంకా సమగ్రత సంతరించుకోలేదు. 2 వేల చోట్ల ఆర్కియాలాజికల్ సర్వే నిర్వహించారు. సాపేక్షికంగా శ్మశానస్థలాలను పేర్కొన్నారు. పురావేత్తలు, మానవ శాస్త్రవేత్తలు సమాధుల అస్థిపంజర వివరాలు, హరప్పా సమాజాల మానవ గురించి, ల నుంచిప్రజల గురించి రు. ఆహారం, పరిశీలన చేశా రు. వాటిని బట్టి అధికార వికేంద్రీకరణ గల సమాజాలుండేవని అనిపిస్తున్నది. కొన్ని అసాధారణ సమాధుల్లో గాయాలు, వమైన గాయాలు, కుష్టు వంటి వాటిని అస్థిపంజరాల్లో స్కగ్ గుర్తించారు. పరిశీలనలో సాంఘిక, తెలియజేశాయి.
రాఖీగఢీ పురావస్తు సముదాయాల సర్వేక్షణ సంస్థ, పూణే దక్కన్ కాలేజీ రాఖీగఢీ మంచి వ్యవసాయ భూములతో కూడుకున్నదని తెలుస్తున్నది. హర ప్పా ఇది తూర్పు ప్రాంత రాజధానిగా ఉండేదని పురా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడ 11 సమాధులను తవ్వి శాస్త్రవేత్తలు సమాచార సేకరణ చేశారు. వీటిలో సెపల్చరల్ (శవసహిత), నాన్-సెపల్కరల్ (శవరహిత) కనిపించడం విశేషం. వీటి ని హరప్పా ప్రాథమిక, గౌణ, సాం కేతిక ఉప విభాగాలను విశ్లేషించారు. సమాధుల్లో ఇటుకల వాడకం ఇక్కడి ప్రత్యేకత. అక్కడ దొరికిన కర్బన పదార్థాలకు చేసిన అవి క్రీ.పూ. 2273-38 సంవత్సరాలకు చెందినవిగా తేలింది.
సింధూ నాగరికతలో సబ్బురాయి ముద్రలలో కొమ్ము జంతువు, జడల ఎద్దు, మూపురమున్నవి, మూపురం లేని ఎడ్లున్నాయి. ముద్రల మీది బొమ్మలు ఆనాటి ప్రజల ధార్మికతత్వాన్ని తెలియజేసేవే. కులీనుడో, పూజారో అతని బొమ్మ స్టియొటైట్ (సబ్బురాయి)లో చెక్కింది మొహెంజొదారోలో లభించింది (ఇది కరాచీలో ఉన్న పాకిస్థాన్ జాతీయ మ్యూజియంలో ఉంది). నగ్న నాట్యకన్య కంచు శిల్పమొకటి కూడా దొరికింది. శిలల శిల్పాలు అరుదు.
హరప్పా ముద్రల మీది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, సుమేరియ న్, హర్రియన్, ఎలమైట్ భాషలకు చెందినది కాదు. దాదాపు ముద్రలలో 500 లిపి చిహ్నాలున్నాయి. ఈ లిపిని ఎవరూ చదవలేదు. ఈ భాషద్రవిడ కుటుంబానికి చెందినద ని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, సిం నాగరికతలో ఒకే రకమైన వస్తు సంస్కృతి ఉన్నది. అది విస్తృతమైన సింధూ సాంస్కృతిక సింధూ నాగరికత విశేషాలు ఇటీవల వందేండ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ దానికి సంబంధించిన చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉండటం విశేషమే మరి!
(వ్యాసకర్త: కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం)
– శ్రీరామోజు హరగోపాల్