పొట్టకూటి కోసం గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన చాలామంది తెలంగాణ బిడ్డలు దళారుల చేతుల్లో మోసపోయి దేశం కాని దేశంలో చిక్కుకుపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్న అలాంటివారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అండగా నిలుస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
సౌదీ, యూఏఈ, కువైట్, ఒమన్, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్ దేశాలకు వేల మంది తెలంగాణ బిడ్డలు శ్రామికులుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు దళారులు తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలతో విదేశాలకు తీసుకెళ్లి మోసం చేస్తున్నారు. నెలలు గడవకముందే వీసా కాలపరిమితి ముగిసిందని అక్కడి సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నాయి. దీంతో అక్రమ చొరబాటుదారులుగా ముద్ర వేసి ఆయా ప్రభుత్వాలు నిర్బంధిస్తున్నాయి. ఇలా దేశం కాని దేశంలో చెరసాలలో మగ్గుతున్న చాలామంది.. కేటీఆర్ విశేష కృషి మూలంగానే మళ్లీ తెలంగాణ మట్టి వాసన పీలుస్తున్నారు.
2017లో 20 మంది తెలంగాణ కార్మికులను కువైట్ పోలీసులు అరెస్టు చేయగా.. అప్పటి మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ఎన్నారై శాఖ ద్వారా అవసరమైన పత్రాలు మంజూరు చేయించి వారిని స్వదేశానికి తీసుకొచ్చారు. 2019లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 40 మంది కార్మికులు ఇలాగే చిక్కుకోగా.. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి తీసుకొచ్చారు. గల్ఫ్‌లోని కార్మికుల కోసం అప్పటి కేంద్ర మంత్రి వీకే సింగ్‌తో మాట్లాడి 2017 మే 12న ‘విదేశీ సంపర్క్ సదస్సు’ను కేటీఆర్ నిర్వహించారు.
నేడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ కార్మికులకు కేటీఆర్ సాయమందిస్తూనే ఉన్నారు. బహ్రెయిన్‌లో ఏండ్లుగా జైలు జీవితం గడుపుతున్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన నరసయ్యను స్వరాష్ర్టానికి తీసుకురావడానికి కృషి చేశారు. మలేషియాలో నిర్బంధంలో ఉన్న ఖానాపూర్‌కు చెందిన ఆరుగురు కార్మికులను విడిపించారు.ఖానాపూర్‌లో ఇద్దరు గిరిజన బాలికలు రోడ్డు ప్రమాదంలో మరణించగా, మలేషియాలో ఉన్న వాళ్ల తండ్రిని సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చారు.
తెలంగాణ బిడ్డలకే కాదు, ఇతర ప్రాంతాల వారికీ కేటీఆర్ బాసటగా నిలుస్తున్నారు. న్యూజిలాండ్‌లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సమయంలో తన తల్లి వైద్య సదుపాయానికి సహకరించాలని కేటీఆర్‌ను ట్విటర్లో కోరారు. తక్షణమే స్పందించిన కేటీఆర్.. నిమ్స్‌లో చికిత్సకు ఏర్పాట్లు చేయించారు. తెలంగాణ బిడ్డలతో పాటు ఇత రులకు కూడా అండ గా నిలబడుతున్న గొప్ప మానవతావా ది మన కల్వకుంట్ల తారకరాముడు.