140 కోట్లకుపైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్‌లో దాదాపు 100 కోట్ల మంది తమ సంతోషం కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్నారట. తమ సరదాలు తీర్చుకునేందుకు అవసరమైన కొనుగోలు శక్తిలేక రాజీపడిపోతున్నారట. దేశంలోని మొత్తం జనాభాలో అతి కొద్దిమంది మాత్రమే అంటే 13-14 కోట్ల మందికి మాత్రమే ప్రాథమిక అవసరాలకు మించి ఖర్చు చేసే శక్తి ఉన్నట్టు ‘బ్లూమ్ వెంచర్స్’ నివేదిక వెల్లడించింది.
నిజానికి దేశ జీడీపీ ఎక్కువగా వినియోగదారులు చేసే వ్యయంపైనే ఆధారపడి ఉంది. దేశంలో ‘వినియోగ తరగతి’ దాదాపు 14 కోట్ల వరకు ఉంటుంది. చాలావరకు స్టార్టప్ కంపెనీలకు వీరే ముడిసరుకు. మిగతా 30 కోట్ల మందిని ‘ఎదుగుతున్న‘ లేదంటే ‘వర్ధమాన’ వినియోగదారులుగా పేర్కొనవచ్చు. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం కారణంగా వీరు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ వీరు అప్రమత్తంగానే ఉంటారు. వీరు భారీ వినియోగదారులే అయినప్పటికీ చెల్లింపుల విషయంలో అయిష్టంగానే ఉంటారు. వీరు ఎక్కువగా ఓటీటీ, మీడియా, గేమింగ్, ఎడ్టెక్, లెండింగ్ వంటివి వీరి (వర్ధమాన వినియోగదారులు) మార్కెట్లు. యూపీఐ, ఆటోపేలను అన్‌లాక్ చేసి చిన్న చిన్న టికెట్లను కూడా వీరు కొనుగోలు చేస్తుంటారు. కానీ, దేశంలోని 100 కోట్ల మంది భారతీయులకు మాత్రం ప్రాథమిక అవసరాలకు మించి కొనుగోలు చేసే శక్తి లేదు. భారత వినియోగదారుల మార్కెట్ విస్తృతం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న కొనుగోలుదారులే తప్ప మార్కెట్లోకి కొత్త వినియోగదారులు రావడం లేదని నివేదిక పేర్కొన్నది. అంటే, దేశంలో ధనవంతుల సంఖ్య పెరగడం లేదు కానీ, వారు మరింత సంపన్నులుగా మారుతున్నారు.
ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా వినియోగదారులను ‘ప్రీమియమైజేషన్” వైపు మళ్లించింది. అంటే కంపెనీలు క్రమంగా మాస్ మార్కెట్ గూడ్స్‌పై కాకుండా హైఎండ్, అత్యంత ఖరీదైన వస్తువులను సంపన్నులకు విక్రయించడంపై దృష్టి సారించాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తుల విక్రయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వేళ లగ్జరీ ఇండ్లు, ఖరీదైన స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఊపందుకోవడం ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు ఐదేండ్ల క్రితం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇండ్లు 40 శాతం ఉండేవి. ఇప్పుడవి 18 శాతానికి పడిపోయాయి.
బ్రాండెడ్ వస్తువులకు కూడా మార్కెట్లో మెజారిటీ వాటా లభిస్తున్నది. అలాగే, మానసిక ఆనందం కోసం ఖర్చు పెట్టే ‘అనుభూతి వ్యయం’ కూడా పెరుగుతున్నది. ప్రముఖుల విభావరి (కన్సర్ట్) వంటి వాటికి ఎంత ధర అయినా టికెట్ కొనుగోలు చేసి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరుగుతున్నది. కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ‘కే-ఆకారం’లో ఉన్నదన్న దానికి ఈ పరిశోధన ఫలితాలు ఊతమిచ్చాయి. అంటే ధనికులు అభివృద్ధి చెందుతుండగా, పేదలు మాత్రం క్షీణిస్తున్న కొనుగోలు శక్తితో ఇబ్బంది పడుతున్నారు.య్యే ప. దీర్ఘకాలిక సవాళ్లు అలాగే ఉన్నప్పటికీ సంప్రదాయకంగా వినియోగదారుల డిమాండ్‌కు కీలకమైన మధ్యతరగతి తగ్గిపోతున్నది.
‘మార్సెల్లస్ ఇన్వెస్టిమెంట్ మేనేజర్స్’ నివేదిక ప్రకారం పన్ను చెల్లించే మధ్యతరగతిలో 50 శాతం మంది గత దశాబ్దకాలంలో వేతన వృద్ధి ఎరిగింది లేదు. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏండ్ల కనిష్ఠానికి పడిపోతున్నదని ఆర్బీఐ
నివేదిక చెప్తున్న దాని ప్రకారం టాప్-10 శాతం భారతీయులు జాతీయ ఆదాయంలో 57.7 శాతం వాటా కలిగి ఉన్నారు. 1990లో ఇది 34 శాతంగా ఉండేది. అయితే, దిగువన ఉన్న సగం మంది వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. పొదురిస్థితి ఉన్నదని నివేదిక పేర్కొన్నది. గతంలో బ్యాంకులు విచ్చలవిడిగా రుణాలు ఇవ్వడంతో వినియోగదారులు చేతికి ఎముక లేనట్టుగా ఖర్చు చేసేవారు. అయితే, ఇప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిబంధనలను కఠినతరం చేయడంతో డబ్బు పుట్టడం లేదు. ఇది అంతిమంగా కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తున్నదిపు క్షీణిస్తుండటం, అప్పులు పెరిగిపోతున్న కారణంగా పడిపోతున్న మందగమనంలో ఉన్న కొనుగోలు శక్తి మున్ముందు మరింత దారుణంగా తయారపదేపదే చెప్తున్నది. కాబట్టి మధ్యతరగతి ఇంటి ఖర్చులతో సంబంధం ఉన్న ఉత్పత్తులు, సేవలు రాబోయే సంవత్సరాల్లో గడ్డు కాలం ఎదుర్కొనే అవకాశం ఉన్నదని నివేదిక వివరించింది. అలాగే, ఆటోమేషన్ కారణంగా వైట్ కాలర్ జాబ్స్‌పైనా కత్తి వేలాడుతున్నదని కూడా నివేదిక పేర్కొన్నది. క్లరికల్, సెక్రటేరియల్ జాబ్స్‌ను ఇకపై ఏఐ ఆధారిత వ్యవస్థ ఆక్రమిస్తుందని హెచ్చరించింది. అలాగే, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లలో సూపర్ వైజర్ ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయని వివరించింది. ‘ది ఎకనమిక్ సర్వే 2025’ కూడా కృత్రిమ మేధ ప్రభావంపై ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది.
-నిఖిల్ ఇనామ్దార్,‘బీబీసీ న్యూస్’ సౌజన్యంతో..