మన భారత ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఎవరైనా, ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. సాధారణంగా డాక్టర్ల వారసులు డాక్టర్లుగా, ఇంజినీర్ల సంతానం ఇంజినీర్లుగా కనిపిస్తారు. అలాగే వ్యాపార కుటుంబాల్లో వారి సంతానం వారసత్వంగా వ్యాపారమే చేస్తుంటారు. కులవృత్తులవారు తరతరాలుగా అదే వృత్తిని చేపట్టటం ఆనవాయితీ. ఇక సినీనటుల కుటుంబాలలో వారసత్వం గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఇతర వృత్తుల్లో ఉన్నట్టుగానే వారసత్వమనేది రాజకీయాల్లో కూడా ఉంటుంది. ఇందులో వింతేమీ లేదు. దాదాపు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలలో ఈ వారసత్వ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కానీ బీజేపీ మాత్రం ఇదేదో వింత విషయంగా, నేరంగా, పాపంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. మరి బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా? బీజేపీ తన నలుపు ఎరుగని గురివిందగింజ తీరుగా ప్రవర్తిస్తున్నది.
మొదటి నుంచి కేవలం కాంగ్రెసు పార్టీ మాత్ర మే వారసత్వ రాజకీయాలకు కేంద్రస్థానమని, బీజేపీ మాత్రం తామేదో ఆకాశం నుంచి దిగొచ్చి న పవిత్రమైన పార్టీ అని పొజులు కొడుతున్నది. ఇతర పార్టీల రాజకీయ వారసత్వాన్ని ఎత్తి చూపుతూ తమ పార్టీలో వారసత్వ రాజకీయాలే లేవన్నట్టుగా ప్రవర్తిస్తున్నది. నిజానికి బీజేపీలోనూ దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు పరంపర కొనసాగుతూనే ఉన్నది.
ఉత్తర భారతంలో…
దక్షిణ భారతంలో
కర్ణాటక :
తూర్పు భారతం:
ఒడిశా: ధర్మేంధ్ర ప్రధాన్ (కేంద్ర మంత్రి)మాజీ కేంద్రమంత్రి దేబేనంద్రప్రధాన్ కుమారుడు.
పశ్చిమ బెంగాల్: సువేందు అధికారి (ఎమ్మెల్యే) బీజేపీ మాజీ ఎమ్మెల్యే శిశిర్ అధికారి కుమారుడు. ఈయన సోదరుడు దిబేందు అధికారి (టీఎంసీ పార్టీ ఎంపీ )
శంతను ఠాకూర్ (కేంద్ర మంత్రి)మాజీ మంత్రి మంజుల్కృష్ణ ఠాకూర్ కుమారుడు.
నార్త్ ఈస్ట్ (అరుణాచల్ ప్రదేశ్):
పేమాకందు (ముఖ్యమంత్రి) డోర్జీకందు (మాజీ ముఖ్యమంతి) కుమారుడు.
పశ్చిమ భారతం :
గుజరాత్: శారదాబెన్ పటేల్ (మహేసనా ఎంపీ) ఈమె మాజీమంత్రి దివంగత అనిల్భాయ్ పటేల్ భార్య.
పూనమ్ బెన్ మాదమ్ (జాంనగర్ ఎంపీ) ఈమె తండ్రి హేమంతభాయ్ మాదమ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాగే ఈమె చిన్నాన్న విక్ర మ్ మాదమ్ ఎమ్మెల్యే (కాంగ్రెస్).
మహారాష్ట్ర:దేవేంద్ర ఫడ్నవిస్(ఉప ముఖ్యమంత్రి) ఇతని తండ్రి గంగాధరపంత్ ఫడ్నవిస్ మాజీ ఎమ్మెల్యే. అలాగే ఆయన చిన్నమ్మ శోభా ఫడ్నవిస్ రాష్ట్ర మంత్రి.
సుజయ్ వికేపాటిల్ (అహమ్మద్ నగర్ ఎంపీ)ఇతని తండ్రి రాధాకృష్ణ వికేపాటిల్ ఏడు సార్లు షిరిడీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈయన మనుమడు బాలాసాహెబ్ వికేపాటిల్ మాజీ కేంద్రమంత్రి
పంకజా ముండే (బీజేపీ జాతీయ కార్యదర్శి) తండ్రి గోపినాథ్ ముండే (మాజీ ఎంపీ.)
భారతీ పవార్ (కేంద్ర మంత్రి ) మాజీ మంత్రి అర్జున్ తులసీరామ్ పవార్ కోడలు.
రావు సాహేబ్ ధాన్వే (కేంద్ర మంత్రి) ఈయన తండ్రి భోఖరాదన్ ఎమ్మెల్యే
గోవా:అతనాసియో మొన్సేరాతే (పానాజీ ఎమ్మెల్యే) ఈమె జన్నీఫర్ మొన్సే రాతే భార్య. ఈయన ఎమ్మెల్యే (తలెయిగావో)
విశ్వజిత్ రాణే (పొరేం,వాలీపోల్ ఎమ్మె ల్యే) ఇతని తండ్రి ప్రతాప్సింగ్ రాణే ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
ఇది బీజేపీ వారసత్వ రాజకీయాల కథ. ఇదీ మోదీ మాటలలోని డొల్లతనం. వారసత్వం కేవలం రాజకీయ రంగ ప్రవేశానికి మాత్రమే తోడ్పడుతుంది. ఆ తర్వాత స్వయం ప్రతిభతో రాణించాల్సిందే. లేదంటే అంతే సంగతులు. అన్నివేళలా చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మలేం కదా!
-డాక్టర్ కోలాహలం రామ్కిశోర్
98493 28496