విద్యార్థి దశ నుంచి సామాన్యుడిగా వచ్చి రాజకీయాల్లో అనన్య సామాన్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు, రాజనీతిజ్ఞుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల నాడి పట్టుకోవడంలో కేసీఆర్‌కు సాటి మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేసి దేశం దృష్టి తెలంగాణపై పడేలా చేసిన కేసీఆర్ అపరచాణక్యుడిలా ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేపోయే నాయకుడు కేసీఆర్.
రైతులు పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు రెండో స్థానానికి చేరింది.
అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థా నం నేడు పరుగులు తీస్తున్నది. అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్. నీటి కష్టాల్ని తొలగించేందుకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలను ప్రారంభించారు. రాష్ర్టాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందు వరుసలో నిలిపేందుకు కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు పథక రచన చేశారు. అన్నదాతల కోసం రైతుబంధును అమలు చేస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం నిరంతరం శ్రామికుడిలా పనిచేస్తున్నారు కేసీఆర్. ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చరిత్రాత్మక విజయం.
అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మనరాష్ట్రం నూతన ఒరవడిని సృష్టించింది. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైంది. పాలన పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర అవతరణ అనంత రం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించుకున్నాం. ఆ ఫలితం ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నది. ప్రజలకు దూరాభారం తగ్గి అందుబాటులోకి వచ్చింది. అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరిగింది.
ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కరించడం ద్వారా తీర్చింది. గిరిజనులకు భూములపై హక్కులు కల్పించింది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. వారికి కూడా రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నది. దీనితో ఆదివాసీలు ఎలాంటి ఆటంకం లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు.
దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పేరుతో విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. చరిత్రలో మునుపెన్నడూ లేని విధం గా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూరుశాతం గ్రాంట్‌గా అందించి ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండ గా నిలుస్తున్నది.
తెలంగాణ భూ భౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయగా నామకరణం చేసి నీటి వనరులకు విజయవంతంగా మరమ్మత్తులు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం వైద్యసేవల ప్రమాణాలను పెంచింది. నేడు స్వపరిపాలనలో ఆరోగ్య రంగం ప్రజలకు అత్యంత చేరువయింది. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
రైతులు పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతు లు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు రెండో స్థానానికి చేరింది.
తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ పరివర్తనను సాధించేందుకు చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల రూపురేఖలనే మార్చివేశాయి. అన్నివర్గాల్లో విశ్వాసాన్ని నెలకొల్పుతూ, సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్న ది. మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. ప్రభుత్వమే అధికారికంగా రంజాన్, క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రతిష్ఠకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. నూతనం సచివాలయం, అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇలా ఎన్నో అద్భుత కట్టడాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభు త్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. సొంతస్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి చేయూతను ఇస్తున్నది.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు పింఛను అందజేసి ఆదుకుంటున్నది. ఏండ్ల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడంతో నేడు పచ్చని చేలతో రాష్ట్రం కళకళ లాడుతున్నది. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మరో రూ.19 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది.
అన్ని వర్గాలకు మంచి జరగా లన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానివెనుక ఉండేది మానవీయ కోణమే. తెలంగాణ అభివృద్ధి మాడల్‌తో ఇప్పుడు దేశ్ కీ నేతగా బీఆర్ఎస్ ప్రస్థానం మొదలు పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్.
-తీగల అశోక్ కుమారు
79891 14086