అంతరిక్ష చరిత్రలో
అపూర్వ దిగ్విజయం!
చంద్రుని దక్షిణ ధృవాన
‘చంద్రయాన్’ పదముంచిన
జాబిల్లిని చుంబించిన
భారత్ మహోదయం!
భద్ర రోదసీ విజయం!!
అగ్ర రాజ్యాలైన అమెరికా,
రష్యాలకు
సాటిగా..దీటుగా
మేటిగా నిలిచినట్టి
సువర్ణాక్షరాల కొలుచు
సుందర అధ్యాయమిదే!
గ్రహాన్వేషణలందున
గర్వించే ప్రతిభతో
విశ్వగురువుగా నిలుచు
విజయ కేతనం మనదే!
చందమామ అందాలను
ధరణీ అనుబంధాలను
శోధించే అదృష్టం
రోదసిలో భారత్‌కే
దక్కినట్టి శుభ సమయం
సమస్త విశ్వానికే
కలిగించెను విస్మయం
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ
92465 41699