దేశమంతా ఎగురుతోంది
మన మువ్వన్నెల జెండా
ఆకాశం మురిసేట్టుగా..
అవని అంత మెరిసేట్టుగా.. ॥దేశ॥
మనం పీల్చే ఈ గాలికి
స్వేచ్ఛా స్వాతంత్య్రానికి..
అసువులు అర్పించిన
అమరులను స్మరిద్దాం ॥దేశ॥
అమృతోత్సవ శుభవేళ
త్యాగధనుల బలి దానాలు
మనసు నిండా తలుచుకుని
నేటి తరానికి వినిపిద్దాం ॥దేశ॥
ఇంటిమీద సరే సరే!
ప్రతి గుండె మీద ఎగరేద్దాం
జనగణమన జయగీతమై
పునరంకితం అవుదాం! ॥దేశ॥
డాక్టర్ , పత్తిపాక మోహన్
99662 29548