ఉత్సవం మహాద్భుతోత్సవం
విశ్వగురువు విజయోత్సవ
మహాపంచ షష్టితం
స్వాతంత్య్ర భారతావని
వజ్రోత్సవం సంబరం
స్వేచ్ఛా అమృత సంఘమ
అజరామర విరచితం
నరనరాన ఉప్పొంగిన
దేశభక్తి తరంగం
చతుషష్టి కళలకు
పుట్టినిల్లు భారతావని
విశ్వశాంతి కోరుకున్న
మనసున్న పవిత్ర జనని
నదీనదుల సంగమ
స్థల మహిమల పదధుని
ఆధ్యాత్మిక వర్షంలో
విలసిల్లిన విద్వన్మణి
కూచిపూడి కథక్.. భరతనాట్య స్వరవేణి
మణిపురి యక్షగాన.. కథాకళిల విరిబోణి
మోహిని అట్ట చెకియార్
ఒడిషాల నాట్యగని
చిత్రలేఖ శిల్పాల.. సంగీతపు పధజని
గోల్కొండ చిత్రదుర్గ
గ్వాలియర్ కోటలు
ఖిలారాయ్ భువనేశ్వర్
ఫతేపూర్ సిక్రీలు
ఆగాఖాన్ మహల్ ఘాట్
అమరావతి ప్యాలెస్లు
వేడుకలకు సిద్ధమైన
పదహారు ప్రాంతాలు
వాదాలెన్నీ ఉన్నా.. వేద సంస్కృతి మనది
ప్రవహించే నదిలా.. సంస్కార ధార ఇది
సూక్తి సుధలు అందించిన
ధర్మభూమి మనది
అడుగడుగున గుడిచూసే.. సైద్ధాంతిక జీవనది
భరతజాతి సిద్ధాంతం.. వెలిగే ఒక క్రాంతిపథం
జ్యోతిర్మయ వాఙ్మయం.. ప్రవహించనీ నిరంతరం
సాలగ్రామ గిరి
93985 93460