(వేదనిధి మాడుగుల మాణిక్య సోమయాజులు వర్ధంతి నేడు)
బ్రాహ్మీమయతేజమా!!
బ్రహ్మానంద హంసమా!!
నడిచే వేదమా
సద్గురు బ్రహ్మమా!
తెలంగాణ సిగ వెలిగిన
ధీవర మాణిక్యమా?
నిరత వేదమంత్ర పూత
నిశ్చల శుభనాదమా
లలితసోమిదమ్మ హృదయ
సుందర సువిభాసమా
వారణాసి విశ్వనాథ
సన్నిధాన వాసమా
భారతీ పవిత్ర మృదుల
గళమంగళ హాసమా
బ్రాహ్మీమయ తేజమా!!
బ్రహ్మానంద తీర్థ స్వరూపమా!!
– మరుమాముల దత్తాత్రేయశర్మ
– డా.జి.ఎం.రామశర్మ