అడిగితివి
గదువ పడితివి
దండం పెడితివి
అది చేస్త
ఇది చేస్త అంటివి
జెండా రంగు చూసి,
నమ్మకం పెంచుకొని
అంగుటితో మీట నొక్కితి
గెలుపులో తేలిపోతివి
మూన్నాళ్లు కాకపాయె
కండువా రంగు మారిస్తివి
ముందు చెప్పాలె గదనే
నా ముఖం ముందుకు
వచ్చే పని లేకపోవచ్చు, రాకపోవచ్చు
నీ ముఖం బొమ్మ
ఎక్కడ పెట్టాలో
నాకు తెలుసన్నా!
-సామాన్య