న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : మారుతి సుజుకీ కొనుగోలుదారులకు షాకివ్వబోతున్నది. కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో వాహన ధరల పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పార్థో బెనర్జీ తెలిపారు.
చిన్న కార్లపై జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో కార్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నదని, ప్రస్తుతం సంస్థ వద్ద 1.75 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయన్నారు. కమోడిటీ ఉత్పత్తుల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని, గ్లోబల్గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.