న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి తాజాగా మరో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ యమహా మోటర్ ప్రవేశించింది. తన తొలి ఈ-స్కూటర్ ‘ఈసీ-06’ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1,67,700గా నిర్ణయించింది. యమహా ప్రీమియం బ్లూ స్కైర్ డీలర్‌షిప్‌ల్లో ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ స్కూటర్ లభించనున్నది.
4కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్ 6.7 కిలోవాట్ల శక్తినివ్వనున్నది. సింగిల్ చార్జింగ్‌తో 169 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ స్కూటర్ గంటకు 79 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ఎకో, స్టాండర్డ్, పవర్ వంటి మూడు రకాల్లో లభించనున్న స్కూటర్ మెరుగైన పనితీరు కనబర్చనున్నది.