పరాయి వారింట్లో
కిరాయికుండే
గరీబుల బతుకుల సంద్రం
అరిగోస వెట్టి
ఉరికొయ్యనెక్కాల్సిన మాకు
రాఖీ పండుగ ఫోన్ కాల్
మా బతుకులకే రాఖీ గట్టింది
ఇంత పెద్ద పట్నంలో
ఇల్లు సొంతమవుతుందని
పూరిగుడిసె నిడిసిపెట్టి
డబుల్ బెడ్డు రూమింట్లో
డాబుగ జీవిస్తమని
కలలో గూడ కలగనలేదు
కేసీఆర్ అంటేనే..
కోర్కెల చెల్లించు రావు
కలకాలం సీయమ్మై, పీయెమ్ముగ వెలుగుగాక
-రావిరాల స్వామి
98488 33416