ఛాయ్‌వాలా వామనుడు
ఎక్కడ పాదం మోపితే అక్కడ
రైతుల ఆత్మహత్యలు, మహిళలపై హత్యాచారాలు
దళితులపై గో రక్షక దాడులు, హత్యలు
ఆకలి చావులు, బీభత్స దృశ్యాలు
మూడో పాదం మోపకుండానే
మహారాష్ట్రతో సహా
చాలా ప్రభుత్వాలను ధ్వంసం చేసి
అధికారాలను కొల్లగొట్టి
రాష్ర్టాలను చేజిక్కించుకుంటున్నాడు!
చౌకీదారు వామనుడు దేశాన్ని కబ్జా చేశాడు
ఇప్పుడు రాష్ర్టాలను
చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం..
సంపదను కార్పొరేట్ దొంగలకు
దోచి పెడుతూ
తన మాట వినని వాళ్ల పైకి
ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నాడు
త్యాగాల తెలంగాణపై కన్ను పడి
కొనుగోలు దుకాణం తెరిచిండు
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ
సబ్బండ కులాల త్యాగానికి ప్రతీక
మత ఛాందసవాద వ్యతిరేక చైతన్య గీతిక
యుద్ధాలెప్పుడూ నియంత పాలకులవే
ప్రజలవి పోరాటాలు
తెలంగాణ ఉద్ధరిస్తానంటూ
తెలంగాణ విచ్ఛిన్నానికి
పావులు కదుపుతుండు!
-ఎదిరెపల్లి కాశన్న
96400 06304