Munugode : ‘కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రం’
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మేలో భాగంగా..
మునుగోడు, జనవరి 22 : కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మేలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి మునుగోడు ఎంపీడీఓ గంగుల యుగంధర్ రెడ్డికి సిఐటియు సమ్మె నోటీసును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోడ్ లను చేసేందుకు గత సంవత్సరం నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్నారు.
విద్యుత్ సవరణ చట్టం 2025ను రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న ఒక్కరోజు సమ్మెకు మండలంలోని కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిఐటియు మండల సీనియర్ నాయకులు రెడ్డిమల్ల యాదగిరి, మండల అధ్యక్షులు పెరమళ్ల రాజీవ్, సైదులు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

