తలపడడం మాకేమీ కొత్త కాదు!
ఉద్యమాలకే
ఊపిరిలూదిన
తెలంగాణ బిడ్డలం
సమభావం సమదృష్టి
మీకు లేనప్పుడు
భరతదేశానికి
సుపరిపాలనెలా
అందిస్తారు?
కడుపులో కత్తెరలుంటే
రాష్ట్రప్రభుత ఎలా
ఆలింగనం
చేసుకుంటుంది?
రాష్ట్ర రాష్ర్టానికొక
రాజకీయం చేస్తూపోతే
సమత మమతల
మానవీయ దేశాన్ని
ఎలా నిర్మించగలరు?
తెలంగాణ గడ్డ
మీ అడ్డా అనుకుంటే
పప్పులో కాలేసినట్టే!
మీరు అధికారంలోవుంటే
తెలంగాణను ఇచ్చేవాళ్ళం
కాదంటావా?
మీలో ఇంత ద్వేషం,
ఆక్రోశం వుంటే ఎలా?
తేలుకొండిలో
తేనెలూరుతాయా?
పాము కోరల్లో
పాలు పుడతాయా?
మేం ప్రజల మనుషులం
వారికేది కావాలో ఇస్తూ
ఆలంభనగా
ఊతమౌతున్నాం
తెలంగాణ ప్రజలను
నమ్ముకున్న వాళ్ళం..
ప్రజలెపుడు
మా పథకాలను
ఆదర్శంగా తీసుకొని
ఓటు ద్వారా మీకు
బుద్ధి చెప్పటంలో
సిద్ధహస్తులు…!
మీరెన్ని ఎత్తులు వేసిన
పై ఎత్తులు వేయడం
కేసీఆర్ గారికి
వెన్నతో పెట్టిన విద్య…
రాబోయే ఎన్నికల్లో
రుచి చూస్తారుగా…
ఎందు కంత తొందర..?
తేకువ కల్గినవారు
తెలంగాణ ప్రజానీకం
వారి అండదండలు
పరిపూర్ణంగా
నిర్ణయాత్మకంగా
ఉన్నంతకాలం
బీఆర్ఎస్ దే
విజయపరంపర…!!!
-డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493