దేశ రాజకీయాల్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన పార్టీలు దేశాభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదు. గత 8 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో పేదరికం, అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ అభివృద్ధి నమూనా నినాదంతో జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్ దేశానికి ఆశా కిరణంలా కనిపిస్తున్నది.
బీజేపీ మొదటిసారి వాజపేయి హయాంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లౌకికతత్వాన్ని అపహాస్యం చేస్తూ వచ్చింది. అంబేద్కరిజాన్ని దూరంగా నెట్టింది. హిందుత్వ అజెండాతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఎనిమిదేండ్లుగా వివిధ రాష్ర్టాల్లో పాలక ప్రభుత్వాలను కూలుస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రథమ ప్రధానిని ఎంపిక చేసే అవకాశం గాంధీజీకి వచ్చింది. నాడు ఆ పదవికి నెహ్రూ, పటేల్, అంబేద్కర్ అర్హులుగా కనిపించారు. హిందుత్వ భావజాలం కలిగిన పటేల్, గొప్ప విద్యావంతుడు, అట్టడుగువర్గాల నాయకుడిగా పేరొందిన అంబేద్కర్‌ను కాదని లౌకికవాది అయిన నెహ్రూను గాంధీజీ ప్రధానిని చేశారు. నెహ్రూ రష్యా సోషలిస్టు విధానాల ప్రేరణతో లౌకిక విధానాలను అనుసరించి నవభారత నిర్మాతగా కీర్తి గడించారు. అలీన విధానం. సర్వ మత సమానత్వ భావనను అనుసరించి శాంతిదూతగా ప్రసిద్ధి చెం దారు. భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వరం గ సంస్థల స్థాపన, హరిత విప్లవానికి కారణమై దేశాభివృద్ధికి తన వంతు కృషిచేశారు.
నెహ్రూ తర్వాత కాంగ్రెస్ సెమీ హిందుత్వ, సెమీ లౌకికవాదాన్ని అనుసరించింది. పేదరిక నిర్మూలన, వైజ్ఞానికాభివృద్ధికి కొంత కృషిచేసినా అవి పెద్దగా ఫలితాలివ్వలేదు. కాంగ్రెస్ విధానాలు మనువాద, హిందుత్వ పార్టీ అయిన జనసంఘ్ ఎదుగుదలకు తోడ్పడ్డా యి. నాడు దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ సిద్ధాంతాలకు కొంచెం దూరం జరగడం వల్ల బలహీనపడ్డాయి. జనతా ప్రయోగం జనసంఘ్ ఎదుగుదలకు దోహదం చేయగా, గాంధేయవాద సోషలిజం బీజేపీ ఆవిర్భవించడానికి తోడ్పడింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు మౌలిక స్వభావాన్ని కోల్పోవడం వల్ల బీజేపీ బలపడుతూ వచ్చింది. బాబ్రీ మసీదు విధ్వంస ఘటనను ఉపయోగించుకొని బీజేపీ హిందుత్వ భావనను రెచ్చ గొట్టింది. తద్వారా కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.
దేశ రాజకీయాల్లో ఈ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు దేశానికి ఒరగ బెట్టిందేమీ లేదు. ఈ పార్టీలు ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించే ప్రయత్నం చేయలేదు. బహుజనుల సమస్యలను పరిష్కరించలేదు. మొదటి నుంచీ దేశ రాజకీయాల్లో ఆధిపత్యం వహించిన ఉత్తరాది నాయకులు దక్షిణభారత దేశాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ఈ వివక్ష నుంచే ప్రాంతీయ పార్టీ లు, ద్రవిడ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, ఉద్యమపార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ, ఉద్యమపార్టీలు ఎన్నికల్లో జాతీయపార్టీల కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి. బహుజన సమాజ్‌వాదీ పార్టీ దేశవ్యాప్తంగా బహుజనులను ఆకర్షించినా వివిధ కారణాల వల్ల యూపీ మినహా మిగిలిన రాష్ర్టాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
బీజేపీ మొదటిసారి వాజపేయి హయాంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లౌకికతత్వాన్ని అపహాస్యం చేస్తూ వచ్చింది. అంబేద్కరిజాన్ని దూరంగా నెట్టింది. హిందుత్వ అజెండాతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఎనిమిదేం డ్లుగా వివిధ రాష్ర్టాల్లో పాలక ప్రభుత్వాలను కూలుస్తున్నది. విపక్షాలను ఈడీ, సీబీఐలతో వేధింపులకు గురిచేస్తున్నది. రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తున్నది. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ సామాజిక, ఆర్థిక అంతరాలు పెరగడానికి కారణమైంది. బీజేపీ పాలనలో దళితులు, బహుజనులు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. సామాన్యులపై పన్నులు, ధరల భారం అధికమైంది.
బీజేపీకి పోటీగా నిలిచే సత్తా ఏ పార్టీకి లేని తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ భవిష్యత్తు బాగుండాలంటే, బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. దేశ రాజకీయాలను సామాన్యుల సమస్యలను పరిష్కరించేవిధంగా తీర్చిదిద్దగల సామర్థ్యం కేసీఆర్‌కు మాత్రమే ఉందని తెలంగాణ లో ఆయన ఎనిమిదేండ్ల పాలన రుజువు చేస్తున్నది. తెలంగాణను ఆయన దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాలు దేశమంతటా అమలుచేయదగినవి.
రైతు బంధు, దళితబంధు, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, అణగారినవర్గాల విద్యార్థులకు గురుకుల విద్యాసంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు.. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సం క్షేమ పథకాలు దేశ సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న హరితహారం వాతావరణ కాలుష్యానికి అద్భుతమైన పరిష్కారం. తెలంగాణలో గత ఎనిమిదేండ్ల లో ఎక్కడా మత కలహాలు జరగలేదు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో జీవిస్తున్నారు. కేసీఆర్ సమర్థపాలన వల్లే ఇది సాధ్యమైంది. ఇదేవిధమైన సమర్థపాలన ఇప్పుడు దేశానికి అవసరం. దేశాభివృద్ధికి కేసీఆర్ నడుం బిగించారు. ఆయన దగ్గర ఇందుకు పక్కా ప్రణాళిక ఉన్నది. అందుకే బీఆర్ఎస్ను చూసి బీజే పీ భయపడుతున్నది. బీఆర్ఎస్ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నది. కానీ కేసీఆర్, ఆయన పార్టీ వీటికి భయపడటం లేదు. కేసీఆర్‌ది కుల, మత, ప్రాంత విభేదాలకతీతమైన మానవీయ అభివృద్ధి నమూనా. దేశ రాజకీయాలను మత, కార్పొరేట్, హింసాయుత మార్గం నుంచి మానవీయ రాజకీయాల వైపు నడిపించడంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించనున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
-డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567