సమస్యలు సృష్టించేది వారే
వాటిని పరిష్కరించినట్లు నటించేదీ వారే
ఒకవైపు మెప్పు కోసం పాకులాడేది వారే
మరొక వైపు లబ్ధి కోసం తగవు చేసేదీ వారే
అమాయకత్వాన్ని ఆటబొమ్మగా మార్చేది వారే
అంగట్లో మంచితనాన్ని వేలం వేసేదీ వారే
విషాన్ని దాచి విదుర నీతులు బోధించేది వారే
విలువలను పాతరేసే దగాకోరులూ వారే
వారి నిజరూపం తెలిసినా, తెల్వకున్నా
పాపాత్ములు పాడైపోతారని ఆత్మతృప్తి పడాలి
మనసు చంపుకొని మౌన జపం చేయాలి
మన రాతలే గింతని సర్దుకుపోవాలి
అందరూ మంచివారే అని గట్టిగా అనాలి
అనకుంటే..?
-దుర్గమ్ భైతి
99590 07914