తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా మండలంలోని అలుగునూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు( Congress Leader ) బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టారు.
అల్గునూర్ డివిజన్ లో కీలకంగా ఉన్న కాల్వ మల్లేశం ( Kalva Mallesam ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ గులాబీ కండువా కప్పి మల్లేశంను ఆహ్వానించారు. కాల్వ మల్లేశం చేరికతో డివిజన్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది.
డివిజన్లో కష్టపడి పనిచేయాలని, పార్టీ గెలుపునకు కృషి చేయాలని నాయకులకు కేటీఆర్ సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి స్వామి రెడ్డి, సిద్ధం వేణు, మాతంగి లక్ష్మణ్, డివిజన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.