ఓ రాజ్యా(మో)దీషాలు
మునుగోడు గడ్డ మీద
మీ దొంగాటలు సాగవు
మీ కాషాయ నాటక
ప్రదర్శనలు రక్తికట్టవు
మత మంత్రాంగాలు
ముమ్మాటికీ పారవు
నల్లధనం మూటలు
చెల్లుబాటు కాబోవు
కుట్రల కుయుక్తులు
కించిత్ పనిచేయవు
చీకటి ఎజెండాలు
వెలుగులు చిందవు
నక్కజిత్తుల కూతలు
జనగణాలు నమ్మవు
బడా చోర్ లెక్కలు
బహురూపు వేషాలు
బిచ్చగాడి అర్తింపులు
ఢిల్లీ సిల్లీ రాజకీయాల్ని
తెలంగాణం పసిగట్టింది
ఓడించ శపథం పూనింది
మీరు తలకిందులుగా
తపస్సులు చేసినా
మునుగోడు గడ్డ మీద
కమలం వాడిపోక తప్పదు
గులాబీ గుబాళించక మానదు
-కోడిగూటి తిరుపతి
95739 29493