వెనుకట బస్సులు లేని కాలంలో ఊళ్లకు ఊళ్లకు మధ్య పిల్లాపాపతో కలిసి కచ్చురం బండ్ల మీద వెళ్లేవాళ్లు. బాటంతా అడవులు,గుట్టలు దాటి పోవాల్సి వచ్చేది. తోవలో వాగు (గంగ) కనిపిస్తే బండ్లు ఆ రేవులో ఆపుకొని సద్ది మూట తీసి భోజనాలు చేసి గంగ నీళ్లు కడుపునిండా తాగేవాళ్లు. ఈ సద్దిమూటలో అన్నానికి.. ఆ గంగకు ఏ సంబంధం లేదు. కడుపునింపింది గంగమ్మ కూడా కాదు.అయినా సరే ప్రజలు ఆ రేవును ఎంతగా తలుచుకునేది అంటే.. ‘తిన్న రేవును మరువద్దు’ అనే నానుడి పుట్టింది. అది తెలంగాణ నియత్!డుకు ఇవాళ తాగునీరు వచ్చింది. అలాగే రేపు సాగునీరు వస్తుంది. తెలంగాణలో ప్రతి ఎకరానికి ఇవ్వాలనేది ఆయన సంకల్పం. కనుచూపు మేర ఎటు చూసినా పచ్చని పంటలు.. చెవులారా వినాలనిపించే సాగునీటి గలగలలు.. అనే రేపటి మునుగోడు సుందర దృశ్యాన్ని ప్రజలకు భరోసా ఇవ్వగలిగింది కేసీఆర్ ఒక్కడే.
శివుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్లు మునుగోడు ప్రజలు ఫ్లోరైడ్ గరళాన్ని భరించారు. దశాబ్దాల తరబడి పోరాటాల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తాగునీటిలో ఫ్లోరైడ్ సమస్య తీర్చింది. ఇక భూగర్భ జలాల కారణంగా పంటలు విషపూరితం కాకుండా నిరోధించాలి.అందుకు నదీజలాలు తరలించాలి. కేసీఆర్ పట్టుదల వల్ల మునుగోతిన్న రేవును మరువొద్దు!
2016, జూన్ 1 ;అప్పటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు మాత్రమే. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. కరెంటు పూర్తిగా కుదురుకోలేదు. గ్రిడ్‌తో అనుసంధానించే లైన్లు పూర్తి కాలేదు. ప్రాజెక్టులు ప్రారంభదశలో ఉన్నాయి. మీడియా తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపేందుకు పనిగట్టుకొని వ్యతిరేక కథనాలు గుప్పిస్తున్నది. ముంపు పేరిట విపక్షాలు ఇటు వీధుల్లో అటు కోర్టుల్లో అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. అయినా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు సాధించి చూపుతామని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పారు. 2022 నాటికి పూర్తిగా పచ్చని తెలంగాణ సాధిస్తానని తన విజన్‌ను ప్రకటించారు. తనకు తానే డెడ్‌లైన్ విధించుకున్నారు. ఆనాటి బడ్జెట్.. రాజకీయ పరిస్థితులు.. అధికార యంత్రాంగం పనితీరు.. ప్రాజెక్టుల నిర్మాణాలకు జీవితకాలం సరిపోని గత చరిత్ర.. నీళ్ల కేటాయింపులో కిరికిరీలు.. ఇవన్నీ లెక్కేస్తే ఆ ప్రకటన ఒక సాహసం.ఎదుటివారు నమ్మలేని ఒక అసాధ్యం. ఇవేవీ ఆయన పరిగణనలోకి కూడా తీసుకోలేదు. తెలంగాణ సకల దరిద్రాలకు నీళ్లే పరిష్కారం అనే శిలాసదృశ్యమైన నమ్మకం ఆయనది. అది సాధించడానికి వేసుకున్న తన రోడ్ మ్యాప్ మీద ఆయనకు గుండెనిండా విశ్వాసం. అందుకే అంత ధైర్యంగా కోటి ఎకరాలకు నీళ్లిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఇటు పాలనను అటు ప్రాజెక్టులను ఉరికించారు. ఎన్నో అడ్డంకులు. ఎంతో బొబ్బ. చివరకు ఆయన విశ్వాసమే గెలిచింది. ఆరేండ్ల కింద ఆయన ప్రకటించినట్టుగానే రాష్ట్రం కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణగా మారింది.
2014లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో కేసీఆర్‌ది మామూలు మెజార్టీ. పార్లమెంటులో మోదీది భారీ మెజారిటీ. ఇంచుమించుగా..2022 కల్లా కోటి ఎకరాల తెలంగాణ అని కేసీఆర్ అన్న సమయంలోనే ప్రధాని మోదీ 2022 కల్లా దేశంలో ప్రజలందరికీ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ‘దేశం మారుతున్నది. ముందుకు పురోగమిస్తున్నది’ (మెరా దేశ్ బదల్ రహా హై, ఆగే బఢ్ రహా హై), ‘అసాధ్యం ఇపుడు సుసాధ్యమవుతున్నది’ (న ముంకీన్ అబ్ ముంకీన్ హై) అంటూ ప్రకటించారు. ఆ తర్వాత రెండు ప్రభుత్వాలు రెండోసారి కూడా గెలిచి 8 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్నాయి. ఇవాళ ఇక్కడ కోటి ఎకరాల పచ్చని తెలంగాణ సాధన జరిగింది. అది ప్రజల కళ్లముందు కనబడుతున్నది. మరి దేశంలో ఏం జరిగింది? రైతు ఆదాయాలు ఎన్ని రెట్లు పెరిగాయో, వాళ్లు ఎంత కుదురుకున్నారో గత సంవత్సరం నెలల తరబడి ఢిల్లీ సమీపంలో జరిగిన రైతు ఆందోళనలు చెప్పకనే చెప్పాయి.
తెలంగాణలో కోటి ఎకరాల సాధనే కాదు. ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. సాగుకు ఉచిత విద్యుత్తు, రైతుకు పట్టాభిషేకం, పేదలకు సంక్షేమాభిషేకం, ఇంటింటికీ మంచి నీరు, రెండు లక్షల ఉద్యోగాలు, పుట్లకొద్దీ సంక్షేమ పథకాల అమలు జరిగింది. భేషైన పాలనకు గుర్తుగా కేంద్రమే పలు అవార్డులు ఇచ్చింది.
మరి కేంద్రంలోని బీజేపీ ఏం చేసింది. ఈ ఎనిమిదేండ్లలో దేశ ప్రజలకు ఏమిచ్చింది? దేశాన్ని ఏ రంగంలో కొత్త పుంతలు తొక్కించింది? ఎన్ని అవార్డులు సాధించింది? దేశం గర్వంగా తలెత్తుకునే ఏ పని చేయగలిగింది? జీడీపీ పతనం, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, ముంచుకు వస్తున్న ఆహార సమస్య, పాతాళానికి పడిపోయిన రూపాయి విలువ, ఆకాశాన్నంటే ధరలు, సబ్సిడీల ఎత్తివేతలు, ఉపాధి హమీ కోతలు, విచ్చలవిడిగా ప్రభుత్వ సంస్థల అమ్మకాలు, రఫెల్ డీల్‌నుంచి మొదలు పెట్టి, ప్రభుత్వమే సేల్స్‌మెన్‌గా మారిపోయి వ్యాపారుల ప్రయోజనాల కోసం విదేశీబొగ్గు తప్పనిసరి కొనుగోలు జీవోలదాక ఎడతెగని కుంభకోణాలు, ప్రత్యర్థి ప్రభుత్వాల కూల్చివేతలు, విపక్షనేతలమీద సీబీఐ, ఈడీ దాడులు, కేంద్ర మంత్రుల గూండాగిరీ వ్యాఖ్యలు, రైతులపై కారెక్కించే దారుణాలు, శ్రీలంక వ్యవహారంలో అప్రతిష్ట, అమెరికా ఎన్నికల్లో అనవసర జోక్యం, చైనాతో సరిహద్దులో అయోమయం, ప్రాతస్మరణీయులైన జాతి నేతల వ్యక్తిత్వ హనన నీచప్రచారాలు.. ఈ లిస్టు చాలా పెద్దది.
తేడా ఎందువల్ల..?
రాష్ట్రం మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ..రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలన్నదానిపై స్పష్టత.. అది సాధించడానికి అంతకన్నా స్పష్టమైన విజన్.. దానికి తగ్గ రోడ్‌మ్యాప్ కేసీఆర్ విజయానికి కారణాలు!! మోదీకి ఇందులో ఏ ఒక్క క్వాలిటీ లేదు. దేశానికి ఏం కావాలో ఆయనకు తెలియదు. దేశాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలియదు. ఏ పథకానికైనా ముందస్తు ప్రణాళిక ఉండాలని తెలియదు. క్షేత్రస్థాయి పరిస్థితి, దానికి తగ్గ రోడ్ మ్యాప్ అసలే తెలియదు. హఠాత్తుగా నోట్ల రద్దు తెచ్చి దేశం మొత్తాన్ని బ్యాంకుల ముందు బిచ్చగాళ్లలా నిలబెట్టిన తీరు, రైతు చట్టాల పేర రైతులను భయపెట్టి ఆందోళనకు తావిచ్చిన వైనం, ముందుచూపు లేకుండా కరోనా మందులు విదేశాలకు ఇచ్చేసి తీరా దేశంలో కరోనా విజృంభించినపుడు నీళ్లు నమిలిన తీరు ఆయనకు దేశం మీద ఉన్న అవగాహనకు, పాలనా పటిమకు నిదర్శనం.
ఇంతోటి అంబలికి ఇరువై పేర్లు అన్నట్టు బీజేపీ విజయాలేమిటీ అంటే 370 ఆర్టికల్ రద్దు, తలాక్ రద్దు, రామమందిర నిర్మాణం మోదీ విజయాలట. ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆ మధ్య చెప్పారు. ఇదీ ఆ పార్టీకి దేశం మీద, దేశ ప్రజల మీద ఉన్న అవగాహన. ఈ తోపు పార్టీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద విమర్శలు చేస్తారు.
వీళ్లేదో తెలంగాణ శిశువుకు బొడ్డుకోసి పేరు పెట్టినట్టు అమరుల ఆశయాలు నెరవేరడం లేదని, తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతున్నదని, రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని, దివాళా తీసిందని ఏడుపులు పెడబొబ్బలు. వీళ్లే కాదు రాష్ర్టానికి వచ్చే కేంద్రమంత్రులు పార్టీ పెద్దలు అంతా ఒకటే పాట. రాష్ట్రం అప్పులపాలైంది. అధోగతి పాలైంది అని. ఇందులో వాస్తవమెంత? (కింద ఉన్న బాక్సు చూడండి.)
ఇదీ మోదీ సర్కార్ ఘనత..
మొజాంబిక్ అనే దేశం గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఆఫ్రికా ఖండంలో ఓ అనామక దేశం. అక్కడ ఇంకా 70 శాతం యోగ్యమైన భూమి సాగులోకి రానేలేదు. సిగ్గుచేటైన విషయం ఏమిటంటే మనం ఆ దేశంనుంచి కందిపప్పును దిగుమతి చేసుకుంటున్నాం. అంతేకాదు అదే ఖండంలో ఉన్న మాలావి దేశం పేరు విన్నారా? ప్రపంచంలోని 193 దేశాల్లో పేదరికంలో అట్టడుగున 174వ స్థానం. అక్కన్నుంచీ పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం. సుడాన్, టాంజానియా, మయన్మార్ వంటి దేశాలనుంచి కూడా పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం. కెనడా కందిపప్పు దిగుమతిలో అగ్రస్థానం మనదే. ఇంత పెద్ద వ్యవసాయదేశం. మరే దేశానికి లేని విధంగా 55శాతానికి పైగా వ్యవసాయయోగ్యమైన భూమి. జీవనదులు. సింహభాగం ప్రజలు వ్యవసాయదారులు. అయినా ప్రతిరోజు మన ఆహారంలో ప్రధానభాగమైన కందిపప్పు మనకు చాలినంత పండించుకునే స్థితిలో లేని దరిద్రం. కెనడాతో పాటు మలావి, మొజాంబిక్, సూడాన్ వంటి దేశాల పప్పు రుచిగా కూడా ఉండదు.
మనదేశంలోని గుజరాత్ రకం, నాగ్‌పూర్,గుల్బర్గా రకం, ఖమ్మం జిల్లాలోని వైరా ప్రాంతంలోని రకాల పప్పు రుచితో పోలిస్తే ఇవి ఎందుకు పనికిరావు. అయినా దేశంలో తగినంత పంటసాగులేక దిగుమతి చేసుకుంటున్నాం. ఘనత వహించిన మోడీగారి పాలనలో పప్పుల సాగు గత మూడునాలుగు సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరి వల్ల తగ్గిపోయింది. విచక్షణా రహితంగా వివిధ దేశాల నుంచి పప్పుల దిగుమతి, తన వ్యాపార మిత్రుల ప్రయోజనం కోసం ఆ దిగుమతుల మీద సుంకాలు మొత్తం ఎత్తివేయడంతో దేశీయ మార్కెట్లో పంట కొనుగోలు ధరలు భారీగా పతనమయ్యాయ. దీనితో రైతులు ఇతర లాభదాయక పంటలైన సోయాబీన్ తదితర వాణిజ్య పంటల వైపు మళ్లారు. 2022-23 సంవత్సరానికి 252 లక్షల టన్నుల పప్పుదినుసుల డిమాండ్ అంచనా ఉంటే ఉత్పత్తి కేవలం 228 లక్షల టన్నులు మాత్రమే ఉంది.
అంటే 24 లక్షల టన్నులు ఇపుడు దిగుమతి చేసుకోవాలన్నమాట. ఇండియా చమురు అవసరాల్లో మూడింట రెండు వంతులు దిగుమతుల మీదనే ఆధారపడే దౌర్భగ్యకర స్థితి. ఇక వరిసాగు దేశంలో 20శాతం తగ్గింది. జనుము ఉత్పత్తిలో ఒకప్పుడు భారత్‌ది అగ్రస్థానం. ప్రపంచానికి ఎగుమతి చేసిన ఘనత మనది. ఇవాళ ఆ జనుప సంచులను బంగ్లాదేశ్‌నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో 70 శాతం జనపనార మిల్లులు ఉన్న బెంగాల్లో గత ఏడెనిమిదేండ్లలో జనుము పంట దిగుబడి 13 శాతం పడిపోయింది. ఇరవై ఏండ్ల క్రితం టన్ను 30నుంచి 40వేలు పలికేది. మోడీ సర్కార్ వచ్చాక అది 25వేలకు తగ్గిపోయింది. ధరలు కాపాడవలిసిన జ్యూట్ కార్పొరేషన్ పట్టించుకోలేదు. పైగా సంచులు అవసరం లేకుండా ధాన్యాన్ని నిల్వ చేసే అదానీకి చెందిన సీలో గోడౌన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. పీపీపీ మాడల్‌లో దేశంలోని 249 చోట్ల 111 లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన సీలోల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నది. బంగ్లాదేశ్‌లో ఎగుమతుల మీద 10శాతం సబ్సిడీలు ఇస్తుంటే ఇండియా 1శాతం దగ్గరే కుంటుతున్నది. ఇదీ మోదీ సర్కార్ పనితీరు.
బీజేపీ బలమెంత?
రాష్ట్రంలో బీజేపీది బలుపా.. వాపా? పార్టీకి వాస్తవ పునాదులు ఉన్నాయా? అంటే ఆయారాం, గయారాం హంగామా తప్ప పునాది లేదు. అసలు రాష్ట్రంలో బీజేపీ బలమెంత? 2014కు ముందు సగం నియోజకవర్గాలకు అభ్యర్థులే దొరకనంత. నిలబడ్డ అభ్యర్థుల ముఖాలు కూడా ప్రజలకు తెలియనంత. దక్షిణ తెలంగాణలో టికెట్ తీసుకున్న ఓ ఎంపీ అభ్యర్థి మరో జాతీయపార్టీ అభ్యర్థికి అమ్ముడుపోయి ప్రచారమే చేసుకోలేదని పార్టీ వర్గాలే గుసగుసలాడేంత. అసలు వాస్తవం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీతో పోలిస్తే బలమైన పునాది ఉన్న విపక్షం కాంగ్రెస్ పార్టీయే. మారుమూల గ్రామాలనుంచి ప్రధాన పట్టణాల దాక ఆ పార్టీకి నాయకులున్నారు. దానికి తగ్గట్టు సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఉంది. అయితే ఆ పార్టీ దరిద్రమంతా ఢిల్లీలో ఉంది. నెహ్రూ, ఇందిర, రాజీవ్ తర్వాత ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగిన నాయకత్వం కరువైంది. సోనియాగాంధీ ఓ మేరకు ప్రజల్లో సానుకూల ముద్ర వేయించుకోగలిగి అధికారంలోకి రాగలిగినా ఆమె తర్వాత పార్టీని నడిపించే నాయకత్వం కరువైంది.
అనాదిగా జాతీయనాయకుల చరిష్మాపై నడిచే పార్టీ కావడం, ఆ స్థానంలో ప్రస్తుతం ఉన్న వారికి నయాపైసా చరిష్మా లేకపోవడంతో కష్టాలు వచ్చిపడ్డాయి. నాయకుల బొమ్మ, వారి నినాదాలనుంచి స్ఫూర్తి పొంది ప్రజల్లోకి వెళ్లాల్సిన పార్టీ అవేవీ లేక నీరసపడింది. కేంద్రంలో అధికారంలో ఉంటే ఏదో రకంగా నాయకులు, కార్యకర్తలకు ఏదైనా ఉపాధి లభిస్తుందనే ఆశ ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టే ఇక్కడ ప్రధాన విపక్షంగా చావోరేవో అన్నట్టు పోరాడగలిగింది. ఇపుడా పరిస్థితి లేదు. రెండు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేవలేదు. సమీప భవిష్యత్తులో అధికారం చేపట్టగలమనే కనీస సూచన కనిపించడం లేదు. పెద్దనాయకులు తమ దారి తాము చూసుకోవడంతో పార్టీలో నిస్సత్తువ ఆవహించి ఉంది. దాని ఫలితంగానే రాష్ట్రంలో విపక్ష స్థానంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇదే సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల వారి వత్తాసుతో ఆ శూన్యతలోకి అక్కడక్కడా బీజేపీ చొరబడగలుగుతోంది.
అయితే కాంగ్రెస్ వదిలేసిన వాస్తవ శూన్యతతో పొల్చుకుంటే బీజేపీ భర్తీ చేస్తున్నది చాలా తక్కువ. ఎన్నికల్లో పోటీ చేస్తూ కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా ఆర్గనైజ్ చేసుకోవడం చేతకాక ఓడిపోయిన ఆత్మగౌరవాలు, ఉద్యమ పార్టీ అన్న కారణంగా కాస్త పేరు రాగానే తమను తాము తోపులుగా భావించే ఒకరిద్దరు నాయకులు తప్ప పెద్దగా వలసలు లేవు. తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లను విస్మరించి రాజకీయాలు చేయడం చాలా కష్టం. బీజేపీ మైనారిటీ వ్యతిరేక ముద్ర చాలా నియోజకవర్గాల్లో నాయకులను నిలువరిస్తున్నది. కాకపోతే గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా పోటీ చేయడమే ముఖ్యం అనుకునే నాయకులు కొందరుంటారు. బీజేపీ వాళ్లను ఆకర్షించవచ్చు.
మీడియా యావశ్చక్తీ వినియోగించి ఎత్తి పట్టడమే తప్ప అంతకు మించిన సీను, సితారా ఆ పార్టీకి లేవు. దుబ్బాక, హుజూరాబాద్ అంటూ పాట పాడే మీడియా ఆ రెంటికి అటు ఇటు హుజూర్నగర్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేల ఎన్నిక, సగం రాష్ర్టాన్ని కవర్ చేసిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిందని అందులో బీజేపీ గ్యారెంటీ అనుకున్న సీటును టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుందని మరిచిపోతున్నది. అంతెందుకు గత ఎంపీ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ తెగ గంతులేసిందిగానీ.. ఆ వెంటనే జరిగిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క జెడ్పీని గెలువలేక పోయింది. కనీసం ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో పట్టుమని పది సీట్లు రాలేదు. తర్వాత ఎంపీపీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయితీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన స్కోరు బీజేపీ పునాది ఏమిటో చెప్పకనే చెప్పింది. తాజా ఫాంహౌస్ ఉదంతంతో ఆ పార్టీ బాగోతం బట్టబయలు కావడంతో ఉన్న కాస్త అవకాశాలు ఆవిరయ్యాయి.
జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత!
జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో శూన్యత ఉన్నది. కాంగ్రెస్‌పార్టీ సాంకేతికంగా
ప్రతిపక్షమే తప్ప ఆ పాత్రను కనీస స్థాయిలో కూడా పోషించలేక పోతున్నది. రఫెల్ వంటి కుంభకోణాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది.
శ్రీలంకలో మోదీ నిర్వాకం వంటి అంశం మరో దేశంలో జరిగిఉంటే ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఉండేవి. కానీ కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించిందో ఎవరికీ తెలియదు. ఒకటి వెంట ఒకటిగా ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేతలు జరుపుతూ ఉంటే వాటి మీద కనీస స్పందన కూడా లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఇలాంటి కూల్చివేతలు జరిగి ఉంటే విపక్షాలు వీధుల్లో మహోద్యమాలు నడిపి ఉండేవి. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు విపక్షాలు జరిపిన ఉద్యమమే దానికి సాక్ష్యం. ఇవేకాదు గత ఎనిమిదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ విపక్షపాత్రలో శభాష్ అనిపించుకున్నది లేదు. రాహుల్ గాంధీ రాణించలేకపోతు న్నాడు. అధికారంలోకి రావాలనుకునే విపక్షం చావోరేవో అన్నట్టు పోరాడాలి. దానికి ఆ పార్టీ సారథి ముందుండి శ్రేణులను ఉత్తేజపరచాలి. కేంద్రంలో రెండుసార్లు వరుస ఓటములు, అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కోల్పోయిన పార్టీలో జవసత్వాలు నింపి ఉరికించాల్సిన సమయంలో ఆ పార్టీ నాయకుడి తీరు అయోమయం జగన్నాథం అన్నట్టుగా ఉంది.
ఓ వైపు హిమాచల్, గుజరాత్ రాష్ర్టాలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ప్రచారాన్ని ఉరికించి అధికారంలోకి తేవడానికి బదులుగా ఆ పార్టీ నేత దక్షిణాదిలో పాదయాత్ర చేస్తున్నాడు. భారత్ జోడో యాత్ర మంచిదే. కానీ దానికి ఓ సందర్భం ఉండాలి కదా? రాబోయే సమీప కాలంలో ఇంకా మరిన్ని అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. వాటిని వదిలేసి దేశాటన చేయడం ఎవరికి ఉపయోగం? ఇవాళ రాష్ర్టాల్లో బలపడడం మీదే రేపు పార్లమెంటు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రాష్ర్టాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతే ఆ ముఖాలతో ఎన్నికలకు పోయి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ప్రజలకు భరోసా కల్పించడం సాధ్యమ య్యేదేనా? ఇపుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే కాంగ్రెస్ స్కోరు 20కూడా దాటక పోవచ్చు. మిగిలిన పక్షాలు కూడా ఇంతే. ఏ ఒక్కరూ నేరుగా మోదీతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోరాడటం లేదు. బీజేపీ సర్కారు ఎన్ని ప్రభుత్వాలను కూల్చివేస్తున్నా డబ్బులు విరజిమ్మి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నా, తమపై సీబీఐలు ఈడీలు ఎక్కడ పడతాయోనన్న భయంలో ఉన్నారు. అంతేకాదు వీళ్లలో ఎవరికీ దేశం మీద దేశ భవిష్యత్తు మీద ఒక విజన్ కాని కార్యక్రమం కానీ లేవు. ఎన్నికలు రాగానే స్టేజీలెక్కి ఇతర పార్టీల నాయకులతో చేతులు కలిపి ఫ్రంటో టెంటో అంటూ పళ్లికిలించి ఫొటోలకు ఫోజివ్వడమే పోరాటం అనుకుంటున్నారు. దేశ సమస్యల పరిష్కారానికి ఒక్కటంటే ఒక్క ఆచరణాత్మక కార్యక్రమం వీళ్ల నోట విన్నదీ లేదు. ఎదుటివారి అవినీతి మీద ఓట్లు దండుకొని అధికారం అందుకోవడమే ఏకైక కార్యక్రమంగా సాగుతున్నారు.
శివుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్లు మునుగోడు ప్రజలు ఫ్లోరైడ్ గరళాన్ని భరించారు. దశాబ్దాల తరబడి పోరాటాల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తాగునీటిలో ఫ్లోరైడ్ సమస్య తీర్చింది. ఇక భూగర్భ జలాల కారణంగా పంటలు విషపూరితం కాకుండా నిరోధించాలి.అందుకు నదీజలాలు తరలించాలి. కేసీఆర్ పట్టుదల వల్ల మునుగోడుకు ఇవాళ తాగునీరు వచ్చింది. అలాగే రేపు సాగునీరు వస్తుంది. తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలనేది ఆయన సంకల్పం. ఆయన సంకల్పానికి రేపటి మునుగోడు తీర్పు బలం చేకూర్చాలి. గెలుపు అనేది ఒక ప్రోత్సాహం. ప్రజాదీవెన అనేది ప్రభుత్వాన్ని ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయించగల ఒక గొప్ప ఔషధం. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడో చెప్పే అవసరం లేదు. ప్రత్యేకంగా మునుగోడుకు అసలే అవసరం లేదు. ప్రతిరోజు ఇంట్లో నల్లా తిప్పితే వచ్చే భగీరథ నీటిలో కేసీఆర్ ఆశయం కనిపిస్తూనే ఉంటుంది. తిన్న రేవును మరువద్దు అనేది తెలంగాణ నానుడి. పని చేసిన వారిని ప్రోత్సహిస్తే మంచి జరుగుతుంది. రేపటి ఫలితం దాన్ని ప్రతిఫలించాలి. పోలింగ్‌కు వెళ్లే ముందు నల్లా తిప్పి గ్లాసెడు నీళ్లు తాగి వెళ్లండి. కర్తవ్యం బోధపడుతుంది.
మార్పు కోసం ఎదురుచూస్తున్న దేశం..
దేశం ఇపుడు మార్పు కోరుతున్నది. త్వం శుంఠా అంటే త్వం శుంఠ అని ఒకరినొకరు నిందించుకునే మరుగుజ్జు రాజకీయాలతో విసిగి పోయింది. దేశం దిశ దశను మార్చే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. పండిట్ జవహర్లాల్ వంటి ఒక దార్శనికుడి కోసం ఆరాటపడుతున్నది. దేశాన్ని ప్రేమించి దాన్ని బాగుచేసుకోవాలనే ఆరాటం కలిగిన.. అందుకు తగిన మేధోసంపత్తి కలిగిన.. ఆచరణాత్మక రోడ్‌మ్యాప్‌తో ముందుకు తీసుకుపోగల ఒక విజనరీని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. సమకాలీన దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఒక పెను సంచలనం. ప్రజాదరణలో ఒక ప్రచండ మారుతం. పాలనకు, అభివృద్ధికి కొత్త నిర్వచనం. ఒక రాష్ట్రం ఎలా ఉండాలో చేసి చూపించిన నేత. రేపు దేశ పగ్గాలు చేపడితే ఏం చేయగలరన్న ప్రశ్నకు తావే లేదు.తెలంగాణలో ఇప్పటికే లిట్మస్ టెస్ట్ జరిగింది. ఆయన విజన్‌లో జీవ నదులు దేశమంతా పంట కాల్వల్లో పరవళ్లు తొక్కుతుండే ఒక రైతు రాజ్యం సాక్షాత్కారమవుతుంది. గ్రామసీమలు పచ్చగా కళకళలాడుతాయి. భారతదేశం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే ఉందన్నారు మహాత్మాగాంధీ. గ్రామ స్వరాజ్యం ఆయన కల. ఆ కలను నిజం చేయగల ఏకైక నాయకుడు కేసీఆరే!
పెరిగింది అప్పులా? సంపదా?
వరంగల్ జిల్లాలో గవిచర్ల ఓ వ్యవసాయాధారిత గ్రామం. వర్షాలు పడితేనే నిండే అక్కడి ఊర చెరువు కింద ఎప్పుడో నిజాం కాలంలో 180 ఎకరాల ఆయకట్టు ఉండేది. కాలక్రమేణా ఆయకట్టు వంద ఎకరాల దిగువకు పడిపోయింది. అదికూడా వర్షాకాలంలో మాత్రమే 2,530 క్వింటాళ్ల ధాన్యం వచ్చేది. 2015లో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద రూ.30 లక్షలు వెచ్చించి ఈ చెరువు పునరుద్ధరణ జరిపింది. 2016-17 నుంచి చెరువు కింద మొత్తం180 ఎకరాలకు రెండు పంటలకూ నీరు అందుతున్నది. ఇప్పుడు అక్కడ గుంట భూమికూడా ఖాళీ లేదు. రెండు సీజన్లకూ కలిపి ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పున 8,280 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు.అధికారిక లెక్కల ప్రకారం గత ఆరేళ్లలో గవిచర్ల చెరువు కింద రైతులు 49,680 క్వింటాళ్ల ధాన్యం పండించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.1940 చొప్పున లెక్కవేస్తే ఆరేళ్లలో రైతులు పండించిన 49.6 క్వింటాళ్ల ధాన్యం విలువ రూ.9.63 కోట్లు. మిషన్ కాకతీయ లేకుంటే ఈ ఆరేళ్లలో అక్కడ 15,180 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే పండేది. దాని విలువ రూ.2.94 కోట్లు మాత్రమే. అంటే ప్రభుత్వం చెరువు మీద రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ఆరేండ్లలో అదనంగా రూ.6.69 కోట్ల ఆదాయం వచ్చింది. మరి రాష్ట్రంలో అప్పులు పెరినట్టా? ఆదాయాలు పెరిగినట్టా?
కరీంనగర్ అనుభవం..
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడేండ్ల క్రితం మిషన్ కాకతీయ కింద 1854 చెరువులను సుమారు రూ.450 కోట్లతో బాగు చేశారు. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో అదనంగా 1,05,204 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. సగటున ఎకరాకు 22 క్వింటాళ్ల ధాన్యం(వరి) లెక్క వేసుకుంటే 2.31 లక్షల టన్నుల దిగుబడి వస్తున్నది. క్వింటాల్‌కు సగటున రూ.1950 చొప్పున వేసుకుంటే ఒక్కో సీజన్‌కు రూ.451 కోట్ల ఆదాయం వచ్చింది. మిషన్ కాకతీయ పనులు పూర్తయిన చెరువుల కింద మూడేండ్లలో ఐదు సీజన్లలో అదనంగా వచ్చిన 11.55 టన్నుల ధాన్యానికి రూ. 2,225 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ప్రభుత్వం కేవలం రూ.450 కోట్లు వెచ్చిస్తే మూడేండ్లలో 2వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
ఇది ఏ ఒక్క చెరువు కథో ఒక జిల్లాకు పరిమితమైన కథో కాదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువుల విజయగాథ. పెట్టిన ప్రతి పైసా అనేక రేట్ల ఫలితాన్ని ఇస్తున్న అద్భుతగాథ. ఈ చెరువులన్నీ దశాబ్దాల వరకు నీరు అందిస్తూనే ఉంటాయి. రైతుల చేతికి కోట్ల రూపాయల పంటలు వస్తూనే ఉంటాయి. రాష్ట్రం అప్పుల కుప్ప అయినట్టా? అప్పుల సద్వినియోగంతో సంపద పెంచుకున్నట్టా?
సంపద ఎట్లా పెరుగుతున్నది?
వరంగల్ జిల్లాలోని రాయపర్తి 16 వేల జనాభా కలిగిన ఓ మోస్తరు గ్రామం. తెలంగాణ వచ్చేనాటికి ఆ గ్రామపంచాయతీకి ఉన్న ఆస్తులు ఒక గుంటభూమిలో నిర్మించిన పంచాయతీ కార్యాలయభవనం, ఒక ఎకరం భూమిలో నడిచే అంగడి దానిలో షెడ్డు. మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.57 లక్షలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టడంతో పల్లెప్రగతి వంటి కార్యక్రమంతో రాయపర్తి రూపురేఖలు కూడా మారిపోయాయి. ఇవాళ ఆ గ్రామపంచాయతీ అధీనంలో ఉన్న ఆస్తుల విలువ రూ.10కోట్లకు పైమాటే. ప్రభుత్వం ఆ గ్రామానికి ఎకరం 30 గుంటల విస్తీర్ణం ఉండే మూడు పల్లె ప్రకృతి వనాలు , 30 గుంటల్లో ఒక నర్సరీ, ఎకరం భూమి కలిగిన డంపింగ్ యార్డు, రెండెకరాల విస్తీర్ణం కలిగిన వైకుంఠధామం, 30 గుంటల రైతు వేదిక, 8.20 ఎకరాల బృహత్ పల్లె ప్రకృతి వనం, ఎకరం భూమిలో క్రీడా ప్రాంగణం మంజూరు చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వమే భూమి సేకరించి ఇచ్చింది. ఇక్కడి మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి నిర్మాణాల మార్కెట్ విలువ రూ. 10 కోట్లకు పైనే. అంటే కేవలం రూ. 57 లక్షల ఆస్తులు ఉన్న ఓ గ్రామం కేసీఆర్ పథకాలతో ఇవాళ రూ.10 కోట్ల ఆస్తులను సంతరించుకోగలిగింది.
కేవలం ఒక్క గ్రామానికే ఇంత ఆస్తులు సమకూరితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది గ్రామాల్లో ఎన్ని వేల కోట్ల ఆస్తులు పెరిగి ఉంటాయి? మరి రాష్ట్రం దివాళా తీసినట్టా? సంపద పెరిగినట్టా? ఈ మార్పు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడన్నా చూపిస్తారా?
టీవీలో గరికపాటి గారి ప్రవచనం వస్తున్నది. ‘శకునాలు, గ్రహాలు, రాశులు, తిథుల దృష్టితో కలిగే ఫలితం కన్నా.. మన చేతులతో మనం చేసుకునే పనుల వల్లనే ఎక్కువ మంచీ చెడు జరుగుతాయి. మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది. చెడు చేసుకుంటే చెడు జరుగుతుంది. మన కర్మకు మనమే కర్తలం’
నాకైతే ఆయన మునుగోడు ఓటర్లనుద్దేశించి అన్నట్టే అనిపిస్తున్నది.