గ్రీన్ ఎనర్జీతోనే భవిత
విద్యుత్ శక్తి కనిపెట్టిన తర్వాత మనిషి జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. నాగరికత, శాస్త్రవిజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి శిలాజ ఇంధనాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం ప్రారంభించాడు.
ప్రకృతి ప్రసాదించిన శక్తి వనరులను ఉపయోగించుకొని అనేక రంగాల్లో మనిషి అభివృద్ధి సాధిస్తున్నాడు. కానీ ప్రపంచంలో నేటికీ 13 శాతం జనాభాకు విద్యుత్ సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరులను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది.
విద్యుత్ శక్తి కనిపెట్టిన తర్వాత మనిషి జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. నాగరికత, శాస్త్రవిజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి శిలాజ ఇంధనాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. బొగ్గు, పెట్రోల్, గ్యాస్, వంట చెరుకు ద్వారా థర్మల్ విద్యుత్, నీటి ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేశాడు. అయితే జనాభా పెరగడం వల్ల సంప్రదాయ ఇంధన వనరులు సరిపోకపోవడంతో సంప్రదాయేతర ఇం ధన వనరులు ఉపయోగించడం మొదలు పెట్టా డు. పవన విద్యుత్తును, సౌర విద్యుత్తు ఉత్పత్తిని కనుగొని తన జీవితాన్ని మరింత సుఖమయం చేసుకున్నాడు.
అయితే నేటికీ ప్రపంచవ్యాప్తంగా 13 శాతం జనాభాకు విద్యుత్ సరఫరా అందుబాటులో లేదు. ముఖ్యంగా సబ్ సహారా ప్రాంతంలో ఎక్కువగా విద్యుత్ సౌకర్యం లేదు. మన దేశంలో కూడా నేటికీ కొన్ని గ్రామాలకు విద్యు త్తు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో శక్తి వనరుల ప్రాముఖ్యాన్ని, వాటిని సక్రమమైన పద్ధతిలో వాడే విధానాన్ని మనం తెలుసుకోవాలి. పారిశ్రామిక ఉత్పత్తికి, గృహ అవసరాలకు, శక్తి (విద్యుత్ శక్తి) అవసరం అనే విషయాన్ని మరువరాదు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైకులు, కుక్కర్ల వాడకం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ శక్తిని వృథా చేయకుండా అందరూ శ్రద్ధ వహించాలి.
శక్తిని ఉత్పత్తి చేయడం ఎంత కష్టమో , దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని అందరూ గుర్తెరగాలి. లేకపోతే భవిష్యత్తులో చీకటిలో బిక్కుబిక్కు మం టూ బతకాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించాలి. అవసరం మేరకే ఫ్యాన్లు, లైట్లు వంటి వాటిని వాడాలి. ఎల్ఈడీ బల్బులు వాడి ఎక్కువ విద్యు త్తు వృథా కాకుండా చూడాలి. విద్యుత్తు వ్యవస్థలో వైరింగ్ నాణ్యతగా ఉండేలా చూసుకోవా లి. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ శక్తి ని ఉత్పత్తిచేయాలి. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ముడి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి వాటి ధరలు పెరుగుతున్నాయి. బొగ్గు నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. పైగా శిలాజ ఇంధనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి పర్యావరణ కాలుష్యం ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరించాలి. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ (కాలుష్యం కలిగించని పునరుత్పాదక ఇంధన వనరులతో తయారైన విద్యుత్) ఉత్పత్తిని పెంచాలి.
పేదలకు కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని చౌక గా అందించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి. విద్యుత్తు సరఫరాలో నష్టాలు రాకుండా ఉండేందుకు సరైన గ్రిడ్‌ను ఏర్పాటుచేయాలి. ప్రపంచ ప్రజల్లో శక్తి వనరుల వినియోగంపై అవగాహన పెం చడానికి వరల్డ్ ఎనర్జీ ఫోరం ఏటా అక్టోబర్ 22న ప్రపంచ శక్తి దినోత్సవం నిర్వహిస్తున్నది. నవీన ఆవిష్కరణల సాయంతో సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి.
(నేడు ప్రపంచ శక్తి దినోత్సవం)
– ఐ.ప్రసాద్‌రావు , 99482 72919
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

