వొడువని ముచ్చటలెన్నో చెప్పి తెలంగాణ వెతలను తెలిపినోడు జాతి జన హృదయాల్లో నిలిచినోడు
తెలంగాణ ప్రజల బతుకు పాటయై
పల్లె పల్లె తిరిగి ప్రజలకు చెప్పినోడు
తెలంగాణ నేల చెర విడిపించ కదిలినోడు
అన్యాయమేదైనా ఎదిరించి నిల్చి
సీమాంధ్ర వలస పాలకుల గుండెల్లో
ఫిరంగోలే మోగినోడు
ప్రజల బాధలెన్నో చూసి
రాష్ట్ర సాధన పోరుబాటలో నడిచి
ముందు వరుసలో నిలిచిన
మహామనిషి జయశంకర్ సార్
అదరకుండా బెదరకుండా
మొక్కవోని పోరాట పటిమతో
సీమాంధ్ర దోపిడీకి గోరీ కట్టిన
ధైర్యశాలి జయశంకర్ సార్
-కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 94415 61655