ప్రపంచంలో ప్రతీ దేశానికి ఒక రక్షణ వలయం ఉంటుంది. ఆ వలయమే శత్రువుల నుంచి ఆయా దేశాలను రక్షిస్తుంది. ఉదాహరణకు ‘ది గ్రేట్ వాల్’గా పిలువబడే గోడ చైనాకు అత్యంత రక్షణ కవచంగా పనిచేస్తుంది. అట్లాంటి ఒక గోడ మన తెలంగాణకు రక్షణ వలయంగా ఉన్నది. అది మానవరూపంలో ఉన్న అత్యంత బలమైన రక్షణ వలయం. అదెవరో కాదు, మన ఉద్యమ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్.
సీఎం కేసీఆర్‌ను ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ’ అని ఎందుకు అంటున్నానంటే.. తెలంగాణ ఒక వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. ఇక్కడ వనరులున్నా, సంపద ఉన్నా, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని సమైక్య పాలకులు విస్మరించారు. తెలంగాణను ఒక కరువు నేలగా సృష్టించారు. పం టలు పండవు, నీళ్లుండవు, కరెంటు ఉండ దు, వ్యాపారాలు సాగవు… ఇలా రైతు ఆత్మహత్యలు, ఆకలిచావులే శరణ్యమయ్యాయి. ఆ సమయంలో తెలంగాణకు ఒక రక్షణ వలయంలా, తెలంగాణ ప్రజల కోసం చింతమడక నుంచి ఒక ప్రస్థానం మొదలైంది. కేసీఆర్ రూపంలో తెలంగాణ హక్కుల కోసం పోరాటం మొదలైంది. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక ధిక్కార స్వరమై నిలబడ్డారు. పదవులను సైతం గడ్డిపోచలుగా విసిరిపడేసి తెలంగాణవాదాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. పడిన ప్రతీసారి మరింత ఎత్తుకు లేస్తూ బలమైన సీమాంధ్ర నాయకత్వాన్ని, వారి కుట్రలను తుత్తునియలు చేశా రు. రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపించారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు.
తెలంగాణ వచ్చినాక సీమాంధ్ర నాయకులకు వంతపాడే ఈ ప్రాంత నేతలు ప్రభుత్వాన్నే కూల్చే కుట్ర చేశారు. ఆ కుట్రలను ఛేదించి, ఆ సీమాంధ్ర నాయకత్వాన్ని పొలిమేరల దాకా తరిమిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. నాయకులు ఎవరైనా సరే తన పరిపాలనతో, ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల ఆశీర్వాదం పొందాలి కానీ, కుట్రలు చేసి, అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోవాలనుకుంటే పత్తా లేకుండా పోతారని నిరూపించారు కేసీఆర్. తాను కలలుగన్న తెలంగాణ కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలను రూపొందించి దేశంలో తెలంగాణను ‘భేష్’ అనేలా చేశారు. రైతు సంక్షేమం కోసం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక వ్యవసాయరంగమే కాదు, అన్నిరంగాల్లో తెలంగాణను దీటుగా నిలబెట్టి ప్రత్యర్థులకు మింగుడుపడకుండా తయారయ్యారు కేసీఆర్.
కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ ప్రజలకు దొరకడం అదృష్టమైతే, ఈ దుష్ట చతుష్టయం లాంటి ప్రతిపక్షాలు దొరకడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఈ దుష్టరాజకీయ శక్తుల చేతిలో పడితే తెలంగాణ ఆగమైతది. తెలంగాణ సాధించి ఇప్పుడిప్పుడే ఆ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్లీ ఈ దుష్టగ్రహాలకు అవకాశం ఇస్తే ప్రజల నోటికాడి ముద్దను గద్దల్లా తన్నుకుపోతారు. నాడైనా, నేడైనా కేసీఆరే తెలంగాణకు రక్ష. తెలంగాణ బాగుండాలంటే కేసీఆరే మళ్లీ రావాలి. చైనాకు ‘ద గ్రేట్ వాల్’ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్ల. ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ’. అందుకే, ‘ఫిరేక్ బార్ కేసీఆర్ సర్కార్’
తెలంగాణ విజయ్
94919 98702