Vishwak Sen | ప్రభాస్ ‘ఫౌజీ’కి ఒక్కరోజు ముందే విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈ రిలీజ్ డేట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Vishwak Sen | ఒక సినిమా హిట్ కావడంలో కథ, హీరో, దర్శకుడు, ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో.. సరైన విడుదల తేదీ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగితే థియేటర్లు, ప్రేక్షకుల విభజన, ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
Vishwak Sen | ఒక సినిమా హిట్ కావడంలో కథ, హీరో, దర్శకుడు, ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో.. సరైన విడుదల తేదీ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగితే థియేటర్లు, ప్రేక్షకుల విభజన, ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి ఆసక్తికరమైన రిలీజ్ క్లాష్‌పై చర్చ మొదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ విడుదల తేదీని డిసెంబర్ 4గా ప్రకటించడంతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే డిసెంబర్ 3న రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ఫౌజీ’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించడమే.
ప్రభాస్ సినిమా అంటే కేవలం టాలీవుడ్‌కు పరిమితమైన విషయం కాదు. ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండటంతో.. పెద్ద హీరోల సినిమాలు సైతం ప్రభాస్ చిత్రాలతో నేరుగా పోటీ పడేందుకు సాధారణంగా ఆలోచిస్తుంటాయి. ముఖ్యంగా పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదలైనప్పుడు.. థియేటర్ల లభ్యత నుంచి ప్రేక్షకుల ఆదరణ వరకు అనేక అంశాలు ప్రభావితం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫౌజీ’ విడుదలైన మరుసటి రోజే ‘లెగసీ’ని తీసుకురావాలని నిర్ణయించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా పెద్ద స్టార్ సినిమా విడుదలైతే దాని చుట్టుపక్కల కనీసం వారం, రెండు వారాల గ్యాప్ ఉండేలా ఇతర సినిమాలు తమ తేదీలను ప్లాన్ చేసుకుంటాయి. కానీ ‘లెగసీ’ విషయంలో మాత్రం కేవలం ఒక్కరోజు గ్యాప్ ఉండటం ఆసక్తిని పెంచుతోంది.
అయితే ఈ రిలీజ్ డేట్ వెనుక ‘లెగసీ’ మేకర్స్‌ది పక్కా వ్యూహమేననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. ‘ఫౌజీ’ డిసెంబర్ 3న కచ్చితంగా విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమాను తీసుకురావాలనే ఉద్దేశంతో ‘లెగసీ’ టీమ్ ముందుగానే డిసెంబర్ 4పై కర్చీఫ్ వేసిందనే చర్చ జరుగుతోంది.అంటే ‘ఫౌజీ’ అనుకున్న తేదీ నుంచి ఏదైనా కారణంతో వాయిదా పడితే.. వెంటనే ఆ డిసెంబర్ వీకెండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచన ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే ఇది ప్రస్తుతం వినిపిస్తున్న ఇండస్ట్రీ టాక్ మాత్రమే. ‘లెగసీ’ టీమ్ అధికారికంగా ఈ వ్యూహంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.ఒకవేళ ప్రభాస్ ‘ఫౌజీ’ అనుకున్నట్టుగానే డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైతే, మరుసటి రోజే ‘లెగసీ’ని విడుదల చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

