కేంద్రంలోని బీజేపీ నేతలు మాట్లాడితే దేశభక్తి, దేశం గురించి నీతులు వల్లిస్తారు. కానీ, ఆచరణలో మాత్రం నోటికి హద్దూ పద్దు లేకుండా మాట్లాడుతున్నారు. సంస్కారహీనంగా మాట్లాడటమే వారి సంస్కారంగా మారిందన్న విమర్శలను సైతం వారు పట్టించుకోవడం లేదు. రాజకీయ ప్రత్యర్థులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసో, అడ్డగోలుగా మాట్లాడో జనం నోళ్లలో నానితే చాలు అని,అదే తమ రాజకీయమని వారు భావిస్తున్నారా? దీన్నే వారు తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఆయుధంగా ఎంచుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మహిళలపై, వారి వస్త్రధారణపై, ప్రజల ఆహార అలవాట్లపై, కుల మతాలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయి నాయకులు తెలిసో, తెలియకో మాట్లాడి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నాయకులు కూడా ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు. చట్టాలు, రాజ్యాంగ సంస్థలను గౌరవించకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు.
ఆందోళన చెందకండి. సమస్యను పరిష్కరిస్తాం. ఓ జడ్జితో సమస్య ఉంది.ఆయనను దారికి తెస్తాం.- హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్య ఈ కోవలోనిదే. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యపై తీవ్ర దూమారం రేగింది. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల చిట్టా చాలా పెద్దది. ఓ సారి చూద్దాం.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు (రైతులు) పనీపాటా లేని తాగుబోతులు
-అరవింద్ శర్మ, ఎంపీ (బీజేపీ) హర్యానా
రైతులు తిన్నది అరగక ఉద్యమం చేస్తున్నారు. వారిలో ఖలిస్థాన్ తీవ్రవాదులున్నారు. నరేంద్రమోదీని వ్యతిరేకించే వాళ్లు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చు
– గిరిరాజ్ సింగ్, కేంద్ర మంత్రి
– నితిన్ పాటిల్, గుజరాత్ డిప్యూటీ సీఎం
పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లండి. అక్కడైతే చౌకగా దొరుకుతుంది.
– రామ్త్రన్ పాయల్,బీజీపీ రాష్ట్ర నాయకులు, మధ్యప్రదేశ్
తృణమూల్ కాంగ్రెస్ నేతలు అగర్తలలో అడుగుపెడితే తాలిబన్ల తరహాలో దాడిచేస్తాం
– అరుణ్ చంద్ర భౌమిక్, బీజేపీ ఎమ్మెల్యే, త్రిపుర
గాంధీని హతమార్చిన నాథ్‌రామ్ గాడ్సేనే నిజమైన దేశ భక్తుడు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే అక్కడ హిందూ రాజ్యాన్ని నెలకొల్పుతాం
– ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ, భోపాల్
గాంధీ ధోతి మాత్రమే కట్టుకునేవారు. పొట్టి దుస్తులు వేసుకుంటే గొప్పవాళ్లు అయిపోతారని అనుకుంటే, ఆయన కంటే కరుచదుస్తులు ధరించే రాఖీ సావంత్ గొప్ప వ్యక్తి అయి ఉండేది.
– హృదయ్ నారాయణ్ దీక్షిత్, అసెంబ్లీ స్పీకర్, యూపీ
ఒక మహిళా నాయకురాలు (మమతా బెనర్జీ) కాలికి గాయమైందని వీల్ చైర్లో తిరుగుతోంది. ఆమె షార్టు ధరిస్తే కాలు గాయం చాలా స్పష్టంగా కనిపించి ఉండేది.
– దిలీప్ ఘోష్, బీజేపీ నాయకులు, పశ్చిమ బెంగాల్
మమతా బెనర్జీ ఇస్లామిక్ టెర్రరిస్టు. ఎన్నికల్లో ఓడిపోయాక బంగ్లాదేశ్‌కు పారిపోతారు.
– ఆనంద్ స్వరూప్ శుక్లా, సహాయ మంత్రి పార్లమెంటరీ వ్యవహారాలు
ప్రార్థనల కోసం లౌడ్ స్పీకర్లను ఎందుకు వాడుతు న్నారు. మీ దేవుడు చెవిటివాడా?, ముస్లింలకు బీజే పీ టికెట్లు ఇవ్వదు.
– కే ఎస్ ఈశ్వరప్ప, కర్ణాటక బీజేపీ నేత
రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అన్న పదాన్ని తొలగిస్తాం
-అనంత కుమార్ హెగ్డే, కేంద్రమంత్రి
బీజేపీని గెలిపించకపోతే ఉత్తరప్రదేశ్ మరో కశ్మీర్, కేరళ, బెంగాల్‌లా మారుతుంది
– యోగి ఆదిత్యనాథ్, సీఎం, యూపీ
సుప్రీంకోర్టు మాది.. న్యాయమూర్తులు కూడా మా వాళ్లే…
– ముక్త్ బిహారీ వర్మ, మంత్రి, యూపీ
– సీఎస్వీ