అభివృద్ధిని మరిచి అభాండాలా?
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ‘వివేకులు’ అబద్ధాలు వండి వడ్డించినంత మాత్రాన, వినేందుకు తెలంగాణ ప్రజలేమీ చెవిలో పూలు పెట్టుకున్న అవివేకులు కాదు. మీ పత్రికలో, మీ చానల్లో వస్తున్న వార్తా కథనాల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటో వారికి బాగా తెలుసు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉన్నది.
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ‘వివేకులు’ అబద్ధాలు వండి వడ్డించినంత మాత్రాన, వినేందుకు తెలంగాణ ప్రజలేమీ చెవిలో పూలు పెట్టుకున్న అవివేకులు కాదు. మీ పత్రికలో,
మీ చానల్లో వస్తున్న వార్తా కథనాల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటో వారికి బాగా తెలుసు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉన్నది.
‘ఈ నెల 17న ‘వెలుగు’ దినపత్రిక, వీ6 న్యూస్ చానళ్లలో ’కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అంటూ అసత్యాలతో వండివార్చిన పచ్చి అబద్ధపు, కుట్రపూరితమైన వార్తను
తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నపుడే మన ప్రజల పొలాలు పండాలె, వాళ్ల గుండె నిండాలనే తపనతో నిర్మించిన
సాగునీటి ప్రాజెక్టులను బదనాం చేయాలని, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారు.
ప్రజల్లో రోజురోజుకూ కేసీఆర్‌కు పెరుగుతున్న తిరుగులేని ప్రజాదరణను తగ్గించాలనే ఒకే ఒక్క మూర్ఖపు ఆలోచనతోనే సీఎం రేవంత్‌రెడ్డి కండ్లల్లో ఆనందం చూడటానికే ఈ తప్పుడు స్టోరీని వండి ప్రజల్లోకి వదిలారని స్పష్టంగా అర్థమవుతున్నది. కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చని పత్రికలపై బురదజల్లడం అలవాటు చేసుకున్నారు. అందుకే వారి ’వెలుగు’ పత్రిక, ’వీ6’ చానల్ పూర్తిగా ఆ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. అవి ప్రజా పక్షం కాదు, రేవంత్‌రెడ్డి పక్షంగా మారిన పక్షపాత పత్రిక, చానల్! రేవంత్ రెడ్డి ఏది మాట్లాడితే అది రాయడానికి, ఆయన భజన చేయడానికి మాత్రమే మీ ఆలోచనా విధానం పరిమితమైంది తప్ప..గతంలో మాదిరిగా ప్రజల కోణంలో వార్తలు రాయాలనే, ప్రజల మన్ననలు పొందాలనే కనీస విలువలు లేకుండా పోయాయి.
మీకు నిజంగానే పత్రిక ప్రజల ప్రయోజనాల కోసమే అనే సోయి ఉంటే, పత్రికా స్వేచ్ఛ ఉంటే, ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎందుకు నోరు విప్పడం లేదు? ఒక పక్క రైతాంగం తాము పండించిన పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు కోతలతో అల్లాడిపోతున్నామని గగ్గోలు పెడుతూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే..ఆ వార్తలు మీ పత్రికలో గానీ, మీ చానల్లో గానీ ఎందుకు కనిపించడం లేదు?
రైతుల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికే కేసీఆర్‌పై ఈ అడ్డగోలు బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారా? ఇవాళ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముఖ్యమంత్రి బినామీకి సంబంధించిన మెడికవర్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయక అనేకమంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
వారి బంధువులు రోడ్లెక్కి న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ హృదయ విదారకమైన వార్తలు మీ దాంట్లో ఎందుకు రావడం లేదు? వీటిని కవర్ చేయకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదని మీరు అనుకుంటున్నారా? మీరు రాసిన ఆ 58 ఎకరాల ‘పాండురంగ చెరువు’ కథనం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో మీకు తెలుసా? 15 టీఎంసీల భారీ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 5 జిల్లాలు, 10 నియోజకవర్గాల్లోని 2 లక్షల 85 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మెదక్, గజ్వేల్, దుబ్బాక, ఆలేరు, మల్కాజిగిరి ప్రాంతాల పరిధిలో సుమారు 170 కిలోమీటర్ల మేర 750 చెరువులను నింపేలా ఒక బృహత్తర ప్రణాళికను కేసీఆర్ ఆనాడే సిద్ధం చేశారు. అందులో భాగంగానే, 2015లోనే నాటి కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లా ‘గంగాదేవిపల్లి’ గ్రామం ఏ రకంగానైతే ఆదర్శంగా నిలిచిందో..అదే మాదిరిగా ఎర్రవెల్లిలో కూడా సామూహిక వ్యవసాయం జరగాలని, అందరికీ నీళ్లు అందాలని ఆనాడే సంకల్పించి ఆ చెరువును ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లా ‘గంగాదేవిపల్లి’ గ్రామం ఏ రకంగానైతే ఆదర్శంగా నిలిచిందో.. అదే మాదిరిగా ఎర్రవెల్లిలో కూడా సామూహిక వ్యవసాయం జరగాలని, అందరికీ నీళ్లు అందాలని ఆనాడే సంకల్పించి ఆ చెరువును ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. గతంలో ఆ ప్రాంతమంతా గుక్కెడు నీళ్లకు తల్లడిల్లిన డ్రై ఏరియా. పంటలు పండక, భూములన్నీ పడావు పడి ఉండేది.
గతంలో ఆ ప్రాంతమంతా గుక్కెడు నీళ్లకు తల్లడిల్లిన డ్రై ఏరియా. పంటలు పండక, భూములన్నీ పడావు పడి ఉండేది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, కొండపోచమ్మ సాగర్ నిర్మించి, దాని కింద ఉన్న చెరువులను పునరుద్ధరించి, విస్తరించి ఆనాడు ప్రజలకు సాగునీరు అందించడానికి భగీరథ ప్రయత్నం చేస్తే..మీ మూర్ఖపు ఆలోచనలతో ఇవాళ దాన్ని కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే కట్టారంటూ తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి వెలుగులను చూడకుండా, కాంగ్రెస్‌కు అలవాటైన చీకటి వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న మీ యాజమాన్యంలోని పత్రికలో, మీ చానల్లో వస్తున్న వార్తా కథనాల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేమిటో ప్రజలకు బాగా తెలుసు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉన్నది.
ఇప్పటికైనా మీరు అసత్యాలతో రాసిన ఆ వార్త తప్పుడు సమాచారంతో రాశామని అంగీకరిస్తూ మరో వార్త రాయాలి. దీంతోపాటుగా కేసీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.ఇది ‘అబద్ధపు కథనం’ అని మీ పత్రికలోనే ప్రత్యేకంగా సవరణ వార్త ప్రచురించే వరకు మా న్యాయపోరాటం ఆగదు.
మీపై ఇప్పటికే న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి, కోర్టులో కేసు వేయడానికి మా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇలాంటి అసత్యపు, అడ్డగోలు ప్రచారాలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తే భవిష్యత్తులో ఊరుకునే ప్రసక్తే లేదు. 420 హామీలను నమ్మి, కాంగ్రెస్‌ను గద్దెనెక్కించిన ఈ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు రోడ్ల మీదికొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అవేమీ పట్టనట్లుగా మీరు ఆ వార్తలనే ప్రసారం చేయడం లేదు, ప్రచురించడం లేదు. ఇప్పటికైనా మీరు ప్రజల పక్షం వహించి సమస్యలను ప్రసారం చేయకపోతే, త్వరలోనే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
(వ్యాసకర్త: శాసనమండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్)
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

