నీలాకాశం అప్పుడు, నల్లని వేషం ధరించింది!
చిరుగాలి తగలగానే, మేఘమాల చెదిరి సన్నజాజి పువ్వుల్లాగ, చిటపట చినుకులు కురిసే!
తొలకరి వానకు, తలంటు పోసుకొనే భూ దేవి!
జడివానకు గొడుగులు, పురవీధుల్లో నెమలి పింఛంలా పురి విప్పుకుంటున్నాయి!
వర్షానికి హర్షం వ్యక్తం చేస్తూ, బాకా ఊదెను బావురు కప్పలు!
వయ్యారి చినుకులతో కూడి, సయ్యాటలాడే చిన్నారులు!
వానతో నానిన నేల, చలిమిడి పాకం పట్టినట్టు ఊరంతా మట్టి పరిమళాలు!
వానజాణ వచ్చివెళ్లింది!
చెట్టు కొమ్మల్లోకి చేరిన వర్షపు చినుకులు ముదిత దరహాసంలా నవ్వుతున్నాయి!
జి.సూర్యనారాయణ
62817 25659