దేశంలో తాను చేయాలనుకున్న దుష్కార్యాలను కేంద్ర మంత్రులు లేదా ఆ పార్టీ నేతలతో మొదట చెప్పిస్తుంది బీజేపీ. ఆ అంశంపై వ్యతిరేకత వస్తే… సదరు అధికారి లేదా నేత సొంత అభిప్రాయం, దాంతో తమకు సంబంధమే లేదని బీజేపీ చేతులు దులుపుకొంటుంది. వ్యతిరేకత రాకపోతే తాను అనుకున్నది అమలు చేసి తీరుతుంది. కొలీజియం వ్యవస్థపై కూడా బీజేపీ ఇదే ఫార్ములాను వాడింది. కొలీజియం వ్యవస్థను రద్దు చేసి, దాని స్థానంలో తాను అనుకున్న వారిని అందలం ఎక్కించే కొత్త వ్యవస్థకు పురుడుపోయాలని చూసింది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీ… న్యాయవ్యవస్థపై కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నది.
బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈడీ 121 కేసులు నమోదు చేయగా, అందులో 115 ప్రతిపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. ఇది దాదాపు 95 శాతం. ఇక సీబీఐ 124 మంది నాయకులపై కేసులు వేయగా, వారిలో 118 మంది ప్రతిపక్ష నాయకులే. ఈ కేసుల్లో 0.5 శాతం కూడా నిరూపణ కాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ కేసుల ప్రామాణికత.
కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును అడ్డం పెట్టుకొని కొలీజియం వ్యవస్థపై బీజేపీ కుట్రలకు తెరలేపింది. తాను రాజ్యాంగ సవరణ ద్వారా 2014లో తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకపు కమిషన్ (ఎన్‌జేఏ సీ) చట్టాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రిజిజు రూపంలో ఉన్నత న్యాయస్థానంపై బురదజల్లే ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించింది. కేంద్ర పెద్దల అండదండలతో రిజిజు రెచ్చిపోయారు. సుప్రీంకో ర్టు తీర్పులను ఆయన తప్పుబట్టారు. ఓ సందర్భంలో కొలీజియం వ్యవస్థను ఆ యన ఏలియన్‌తో పోల్చారు. అయినా బీజేపీ నుంచి స్పందనే లేదు. దేశవ్యాప్తం గా ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకత రావ డం, అనేక మంది ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనపై సుప్రీంలో పిటిషన్ కూడా వేశారు. ఈ వ్య వహారం ఎంతో దూరం వెళ్తుందని గ్రహించిన కేంద్ర పెద్దలు కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఆయన్ను తప్పించారు.
ఇప్పటికే రాజ్యాంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ న్యాయ వ్యవస్థను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నది. అందులో భాగంగానే కొలీజి యం వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో తాను చెప్పినవారిని అందలం ఎక్కించే కొత్త వ్యవస్థను తీసుకురావాలని మోదీ ప్రయత్నించారు. రాజ్యాంగ సవరణ ద్వా రా 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
బీజేపీ కుట్రలను గ్రహించిన మేధావు లు, ప్రతిపక్షాలు, మాజీ న్యాయమూర్తు లు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీం తలుపుతట్టారు. ఉన్నతన్యాయస్థానం విచారణ చేపట్టి ఈ చట్టాన్ని పక్కనపెట్టిం ది. అప్పటి నుంచి న్యాయ వ్యవస్థపై తన పట్టును నిరూపించుకునేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు తన ప్రయత్నాల ను కొనసాగిస్తూనే ఉన్నది. ఈ నూతన వ్య వస్థలో కేంద్ర న్యాయ శాఖ మంత్రితో పా టు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉం టా రు. వీరి ద్వారా తమకు కావాల్సిన వారిని జడ్జీలుగా నియమించుకునే ప్రమాదం ఉన్నది. తద్వారా తాము అనుకున్నది చేసేందుకు కోర్టులు కూడా అడ్డుపడవన్నది బీజేపీ పన్నిన పన్నాగం. కేంద్రం ద్వారా నియమితులైన న్యాయమూర్తులు స్వామిభక్తిని ప్రదర్శిస్తే దేశంలో న్యాయం కూడా అంగట్లో సరకుగా మారుతుంది. .
దేశంలో బ్రిటిష్ కాలం నాటి గురుతులను చెరిపేస్తున్నామని చెబుతున్న బీజేపీ బ్రిటిషర్లు తెచ్చిన గవర్నర్ వ్యవస్థను మాత్రం మార్చడం లేదు. ప్రతిపక్ష పార్టీ లు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై పెత్త నం చేసేందుకు బీజేపీ ఈ వ్యవస్థను వాడు కుంటున్నది. అందుకే బ్రిటిష్ వారు తెచ్చినప్పటికీ ఈ వ్యవస్థపై బీజేపీ వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నది. అనేక రాష్ర్టాల్లో గవర్నర్లు సమాంతర ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను వారు లెక్క చేయడం లేదు. కేంద్ర అండదండలతో గవర్నర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న లొల్లిని చూ స్తూనే ఉన్నాం. బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై ప్రభుత్వానికే అధికారం ఉం టుందని సుప్రీం చెప్పినా కేంద్రం చెవికెక్కించుకోవడం లేదు. మహారాష్ట్రలో అప్పటి గవర్నర్ భగవంత్ సింగ్ కోశ్యారీ శివసేన ప్రభుత్వాన్ని మె జారిటీని రూపించుకోమ ని చెప్పడాన్ని ఇటీవల సు ప్రీం తప్పుబట్టిన విష యం తెలిసిందే. దేశంలో దర్యాప్తు సం స్థలను బీజేపీ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు వాడుకుంటున్నది. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలపై అభియోగాలు మోపుతున్నారు. ముందుగా బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం ఆ వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయడం పరిపాటిగా మా రింది.
ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనులు కూడా బీజేపీ నేతలే చేస్తున్నారు. గతంలో ఓ రాష్ట్ర ఎన్నికల షెడ్యూలును ఈసీ కంటే ముందే బీజేపీ నేతలు ప్రకటించడం చూశాం. ఫలానా నెలలో ఆయా తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు ముందుగానే చెప్పేస్తారు. దీం తోపాటు ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఈసీ ఎన్నో నిర్ణయాలను తీసుకున్నది. తెలంగాణలో కారును పోలిన గుర్తుల కారణంగా బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడా తో ఓటమిపాలైన ఘటనలున్నాయి.
సెబీ సంగతి చెప్పాల్సిన పనే లేదు. అదానీ ఐపీవో గురించి సెబీని అడిగితే తన వద్ద సమాచారం లేదని చెప్పడం విడ్డూరం. అదానీ వ్యవహారంలో అక్రమాలను బయటపెట్టిన హిండెన్బర్గ్పైనే విచారణకు ప్రయత్నిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టా యి. విదేశీ సంస్థ కావడంతో దీన్ని వదిలేశారే గానీ దేశీయ సంస్థ అయి ఉంటే ఈ పాటికే మూతబడేది. అయినా అక్రమాలు జరిగాయని బయటపెట్టిన వారిపైనే విచారణ చేయ డం ఏంటో అసలు అర్థం కానీ విషయం.
మాలోతు సురేష్
98856 79876