కరువు సమయంలో గ్లోబల్ సమ్మిటా?
రేవంత్‌రెడ్డి, తెలంగాణ సీఎం గారికి, ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 365 మండలాల్లో తీవ్రమైన కరువు నెలకొన్నదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాం. ఇంతటి అసాధారణ సంక్షోభ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించడం మమ్మల్ని దిగ్భ్రాంతి, తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సదస్సును రద్దు చేయాలని లేదా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వాయిదా వేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అక్టోబర్ 15న మంత్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంల ఎల్ నినో పరిస్థితులను కొవిడ్-19 విపత్తుతో పోల్చారు.
రద్దు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 400 మంది పర్యావరణ, పరిశోధన, విద్యారంగ నిపుణులు, పౌర సమాజం ప్రతినిధుల లేఖ
రేవంత్‌రెడ్డి, తెలంగాణ సీఎం గారికి, ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 365 మండలాల్లో తీవ్రమైన కరువు నెలకొన్నదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాం. ఇంతటి అసాధారణ సంక్షోభ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించడం మమ్మల్ని దిగ్భ్రాంతి, తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సదస్సును రద్దు చేయాలని లేదా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వాయిదా వేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అక్టోబర్ 15న మంత్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంల ఎల్ నినో పరిస్థితులను కొవిడ్-19 విపత్తుతో పోల్చారు.
వరి, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఇప్పుడు కూడా అలాంటి మార్పులు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత విపత్తును ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాల సహకారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో నీటి కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో వారిని ఇండ్లకు పంపించారు. పాఠశాలలను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ఇప్పటికే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకు ఒకసారికూడా నీళ్లు రావడంలేదు. అవి కూడా తక్కువ పరిమాణంలోనే వస్తున్నాయి. అక్టోబర్ 24న జారీ చేసిన జీవో-3 ద్వారా తెలంగాణలో నెలకొన్న అత్యవసర పరిస్థితి స్పష్టంగా వెల్లడైంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై మీరే స్వయంగా ఆందోళన వ్యక్థం చేశారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ సమీపంలో గ్లోబర్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. విచిత్రమేంటంటే, సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 8న ఎల్ నినో, వాతావరణ మార్పులు, కరువు అనే అంశంపై ైక్లెమేట్ కాన్క్లేవ్ కూడా నిర్వహిస్తామని చెప్తున్నది.
గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, వారికి భారీ స్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. సహజంగానే ఇందుకోసం హోటల్ గదులు, విందు ప్రాంగణాలు, వంటశాలలు, లాండ్రీ, పారిశుధ్య సౌకర్యాలు, విద్యుత్తు, రవాణా, ప్రజాధనం, పరిపాలనా సిబ్బంది వంటి వనరులు భారీగానే అవసరమవుతాయి. ఇంతటి తీవ్ర కరువు సమయంలో నీరు, ఇతర వనరులపై అదనపు డిమాండ్ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ అదనపు అవసరాల స్థాయి, వాటి కేంద్రీకరణను పారదర్శకంగా అంచనా వేయాల్సిన అవసరమున్నది. ఈ సదస్సు ఏర్పాట్లు చాలా ముందుగానే ప్రణాళిక చేసి ఉండవచ్చు. కానీ ఈ విపత్తు సమయంలోనూ దీన్ని నిర్వహించేందుకే ముందుకు వెళ్లడం తెలంగాణలోని సామాన్య ప్రజలు, చిన్న, సన్నకారు రైతులు, కార్మికులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలను పూర్తిగా పట్టించుకోకపోవడమే అవుతుంది. ధనికులు, ఉన్నతవర్గాల కోసం ఇంతటి భారీ స్థాయిలో విలాసవంతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, రాష్ట్రంలోని సామాన్య ప్రజలు దాహం, ఆకలితో అల్లాడుతుంటే, అది అమానవీయమైన చర్య మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుంది.
సంక్షోభ సమయంలో ప్రజలను గట్టెక్కించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సదస్సు కోసం గ్లోబల్ గెస్ట్ సర్వీసెస్ పేరుతో కేటాయించడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. జిల్లా, మండల స్థాయిలోని అన్ని పరిపాలనా విభాగాలు, మున్సిపల్, పంచాయతీ విభాగాలు, క్షేత్ర స్థాయి శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు అందరూ కరువు పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో పూర్తిగా నిమగ్నం కావాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన కరువు పరిస్థితులను మీరు తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, కరువుపై జారీ చేసిన జీవో అమల్లో ఉన్నంత వరకు కనీసం 2026 గ్లోబల్ సమ్మిట్‌ను వాయిదా వేయాలని కోరుతున్నాం.
ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌ను నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఇలాంటి మరో భారీ సదస్సును భరించే పరిస్థితి రాష్ర్టానికి లేదు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కులను కాపాడేందుకు అవసరమైన ఆర్థిక, పరిపాలనా, ఇతర మానవ వనరులన్నింటినీ తక్షణమే సమకూర్చి, వినియోగించాలని కోరుతున్నాం. తెలంగాణలోని పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, కార్యకర్తలు ఇటీవల హైదరాబాద్‌లో ఒక్కరోజు సమావేశమై ఎల్ నినో సంక్షోభంపై చర్చించారు. ఆదివాసీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి మీకు త్వరలోనే నివేదికను సమర్పించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవీయమైన చర్యలు, నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ లేఖపై సంతకాలు చేసిన 400 మంది వారందరి తరఫున ధన్యవాదాలు.
(తెలంగాణ నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, డాక్టర్ కె.బాబూరావు, లలితా రామదాస్, డాక్టర్ రుక్మిణి రావు, డాక్టర్ సాగరి రామదాస్, బండారి లక్ష్మయ్య, కె.భాను, డాక్టర్ కొండారావు, కన్నెగంటి రవి, హేమ, ఖలీదా పర్వీన్, కిరణ్‌కుమార్ విస్సా, లిస్సీ జోసెఫ్, మరియా తబస్సుమ్, మేరీదాస్, ఎం.వెంకటయ్య, ఎం.తిమ్మారెడ్డి, పులి కల్పన, కె.సజయ, డాక్టర్ ఎస్.సీతాలక్ష్మి, ఏ.సునీత, సరా మాథ్యూస్, సరస్వతి కవుల, కె.సత్యవతి, ఎస్.ఆశాలత, ఎస్క్యూ మసూద్, వెంకట్‌రెడ్డి, ఉమాశంకరి, అఖిల్, సూర్య, మీరా సంఘమిత్ర, అంబటి సురేంద్ర రాజు, చేగొండి చంద్రశేఖర్ తదితరులు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈఏఎస్ శర్మ, ప్రఫుల్ల సమంతర, ప్రొఫెసర్ రేఖావర్మ, సౌమ్యాదత్త, డాక్టర్ ఇంద్రానీ దత్తా, డాక్టర్ గాబ్రియేల్, డి.కల్యాణీ మీనన్ సేన్, ప్రొఫెసర్ షంషుల్ ఇస్లాం, సీఆర్ నీలకందన్, డాక్టర్ జయశ్రీ సుబ్రహ్మణియన్, నీలం అహ్లూవాలియా, ప్రసాద్ చక్కో, రాజేశ్ రామకృష్ణన్, రాజ్‌కుమార్ సిన్హా, రమేశ్ పట్నాయక్ తదితరులు)
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

