సమైక్య పాలనలో పరిశ్రమలకు పవర్ హాలీడే ఎంత సుపరిచితమో.. ఐటీ సెక్టార్‌కు పవర్ కట్ అంతే సుపరిచితం. నాడు ఆఫీస్‌లో లాగిన్ అయి వర్క్ స్టార్ట్ చేయకముందే జనరేటర్ స్టార్ట్ అయ్యేది. క్లయింట్‌తో మాట్లాడకముందే పవర్ కట్ పలకరించేది. వెరసి కరెంట్ కోతలు.. ఉద్యోగులు, కంపెనీల వెతలు. నాణ్యత లేని కరెంటు కారణంగా రాష్ట్రంలో ఉన్న ఒకటీ, అరా కంపెనీలు హైదరాబాద్‌ను వీడేవి. ఇదంతా తెలంగాణ రాకముందు, కేసీఆర్ సర్కార్ అధికార పీఠాన్ని ఎక్కకముందు మాట. కానీ, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాదే కేరాఫ్ అడ్రస్. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ సర్కార్ సరఫరా చేసిన 24 గంటల కరెంటేనన్నది జగమెరిగిన సత్యం.
నిరంతరాయ కరెంటు సరఫరా, మౌలిక వసతుల కల్పనతోనే ఐటీ కంపెనీలు రాష్ర్టానికి వరుస కడుతాయని భావించిన కేసీఆర్.. ఆ దిశగా పటిష్ఠమైన కార్యాచరణను రచించారు. దాని ఫలితంగానే గడిచిన పదేండ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు, ఉద్యోగాలు మూడు రెట్లు పెరిగాయి. అంతేకాకుండా ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ-గ్రేడ్ ఆఫీసు స్పేస్ లీజింగ్‌లోనూ బెంగళూరును హైదరాబాద్ దాటిపోయింది. ఇదంతా కేసీఆర్ హయాంలో సరఫరా చేసిన 24 గంటల కరెంటుతో పాటు విప్లవాత్మకమైన విధానాల వల్లే సాధ్యమైంది.
ఐటీకి కేరాఫ్ హైదరాబాద్: సమైక్యపాలనలో హైదరాబాద్‌లో కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ.. విద్యుత్తు కోతలతో ఐటీ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలిగేది. దీంతో బెంగళూరు వంటి నగరాలకు ఐటీ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరంతరాయ కరెంటు, మౌలిక వసతుల కల్పనపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టిసారించింది. కొత్త స్టార్టప్‌ల ఏర్పాటుకు నైపుణ్య శిక్షణనిచ్చే ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది. ప్రోత్సాహకాలు అందించింది. అలా ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ విధానాల వల్ల ఐటీ పరిశ్రమ పరుగులు పెట్టింది. దేశానికి ఐటీ హబ్‌గా తెలంగాణ మారింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి 20కి పైగా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అలా.. ‘తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగాలు ఉండవు. ఐటీ ఢమాల్ అవుతుంద’న్న వాళ్ల నోళ్లను మూయిస్తూ.. తెలంగాణ ఐటీ కొత్త శిఖరాలను అధిరోహించింది. అంతేకాదు, ఐటీ అభివృద్ధితో ఆ రంగంపై ఆధారపడ్డ ఇతర రంగాలూ ఎంతో లాభపడ్డాయి. ఒక్క ఐటీ ఉద్యోగం సృష్టితో పరోక్షంగా మరో నాలుగు ఉద్యోగాలు వస్తాయని అంటారు. తెలంగాణలో ఐటీ వృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వినోదం, రవాణా, లాజిస్టిక్ రంగాలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించింది.
ఐటీ ఎగుమతులు ఇలా..: బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఐటీ రంగం పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. ఐటీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రతీ ఐదేండ్లకు ఒకసారి ఐటీ పాలసీని కొత్తగా రూపొందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 2016, 2021లో మెగా పాలసీలను రూపొందించి విజయవంతంగా అమలు చేసింది. అంతేకాదు, 2016లో తీసుకొచ్చిన పాలసీలో సబ్ క్యాటగిరీల పేరిట ఐటీలో తీసుకొచ్చిన విప్లవాత్మక నూతన విధానాలు ఓ చరిత్రనే సృష్టించాయి. టీహబ్, టీహబ్ 2.0, టీవర్క్స్, వీహబ్, టీఎస్ఐటీ, రిచ్ వంటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడమే కాదు.. వాటిని సమర్థవంతంగా నిర్వహించింది.
ఐటీలో కేసీఆర్ ప్రభుత్వం తీతెలంగాణ ఐసీటీ పాలసీ (2016)
ఎలక్ట్రానిక్స్ పాలసీ (2016)
ఇన్నోవేషన్ పాలసీ (2016)
డేటా సెంటర్స్ పాలసీ (2016- దేశంలోనే మొదటిది)
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పాలసీ (2017)
బ్లాక్ చెయిన్ పాలసీ (2019- దేశంలోనేమొదటిది)
డ్రోన్ పాలసీ (2019 – దేశంలోనే మొదటిది)సుకొచ్చిన పాలసీలు
మీకు తెలుసా?
మీకు తెలుసా?
తెలంగాణ ఏర్పాటు సమయంలో 3 స్టార్టప్ ఇంక్యుబేటర్లు, 200 స్టార్టప్ కంపెనీలు మాత్రమే ఉండేవి. 2023 నాటికి అవి 77 ఇంక్యుబేటర్లు, 7 వేలకు పైగా స్టార్టప్‌లకు పెరిగాయి.
అంతర్జాతీయ రికార్డులు: కేసీఆర్ హయాంలో జరిగిన ఐటీ అభివృద్ధితో గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ సత్తా చాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ నివేదికగా చెప్పుకొనే జీఎస్‌ఈఆర్-2022లో రాష్ర్టానికి స్థానం దక్కడం విశేషం. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ టాప్-10 జాబితాలో స్థానాన్ని సంపాదించింది. ఏషియన్ ఎకో సిస్టం ఇన్ అఫర్డబుల్ టాలెంట్ జాబితాలోనూ టాప్‌ప్లేస్‌లో నిలిచింది.
ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలపై ‘ది ఎకానమిస్ట్’ ఏమన్నదంటే?: కేసీఆర్ పాలనలో ఐటీ రంగం సాధించిన గణనీయమైన ప్రగతిపై ప్రపంచ ప్రఖ్యాత వీక్లీ మ్యాగజీన్ ‘ది ఎకానమిస్ట్’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదేండ్లలో తెలంగాణలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కినట్టు వెల్లడించింది. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని, తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వివరించింది. పదేండ్లలో ఐటీ రంగంలో మూడు రెట్ల మేర ఉద్యోగాలు పెరిగి 9 లక్షలకు చేరినట్టు వెల్లడించిన పత్రిక.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని, ఏటా లక్షలాదిమంది ఈ నగరానికి ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నట్టు వివరించింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం టెక్ వ్యూహాన్ని రెట్టింపు చేసినట్టు కొనియాడింది.
కేసీఆర్ పాలనలో ఐటీ రంగం సాధించిన గణనీయమైన ప్రగతిపై ప్రపంచ ప్రఖ్యాత వీక్లీ మ్యాగజీన్ ‘ది ఎకానమిస్ట్’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదేండ్లలో తెలంగాణలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కినట్టు వెల్లడించింది.
తొమ్మిదేండ్లలో ఐటీ ఉద్యోగాల కల్పన ఇలా..
తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు ఇలా..
సంవత్సరం ఉద్యోగాలు
తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతులు ఇలా
పదేండ్లలో ఐటీ ఎగుమతుల విలువ
సంవత్సరం ఎగుమతులు (రూ. కోట్లలో)
-కడవేర్గు రాజశేఖర్