Viral Video | సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన గొరిల్లా.. కిందపడిన కోపంలో ఏం చేసిందో చూడండి!
పొడవాటి చేతులు, విశాలమైన ఛాతీలతో బుల్డోజర్లలా ఉండే గొరిల్లా.. ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేసిందీ గొరిల్లా. డాక్టర్ సామ్రాట్ గౌడ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక గొరిల్లా కింద కూర్చొని ఉండగా.. మరో గొరిల్లా ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వచ్చింది. అలా కొంచెం దూరం వెళ్లిందో లేదో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయింది. పడిపోయాననే కోపంతో సైకిల్‌ను ఎత్తి విసిరేసిందా గొరిల్లా. ఈ వీడియోను షేర్ చేసిన సామ్రాట్ గౌడ.. ‘‘స్టుపిడ్ సైకిల్’’ అంటూ గొరిల్లా మనసులోని మాటను ట్వీట్ చేశారు.
ఇది చూసిన నెటిజన్లంతా నవ్వలేక చస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ‘‘స్టుపిడ్ సైకిల్.. నన్నే పడేస్తావా? నువ్వు నాకొద్దు.. అనుకున్నట్లున్నాడు’’ అంటూ ఆ గొరిల్లా గురించి కామెంట్ చేశాడు. ఏదిఏమైనా ఇప్పటి వరకు 65 వేలపైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తూనే ఉంది.
Stupid cycle 😡!!!……….😃 pic.twitter.com/hGXZBEGSL7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 8, 2022
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

