Viral | కర్ఫ్యూలో క్రికెట్ ఆడుకోవచ్చా? అని అడిగితే.. వైరలవుతున్న పోలీసుల సమాధానం
Viral | దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి.

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నియంత్రణకు ఈ నిబంధన బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వీకెండ్ కర్ఫ్యూ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు, ఒక ట్విట్టర్ యూజర్‌కు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పునీత్ శర్మ అనే ట్విటర్ యూజర్ ఒక ప్రశ్న వేశాడు. ‘‘సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి క్రికెట్ ఆడుకోవచ్చా?’’ అని పునీత్ ప్రశ్నించాడు. దీనికి ఢిల్లీ పోలీసులకు క్రికెట్ పరిభాషలోనే సమాధానం ఇచ్చారు.
‘‘అది సిల్లీ పాయింట్ సర్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కవర్ తీసుకోవాలి. అంతేకాదు, ఢిల్లీ పోలీసులు క్యాచింగ్‌లో నిపుణులు’’ అంటూ బదులిచ్చారు.
ఇది చూసిన నెటిజన్లు ఢిల్లీ పోలీసుల రిప్లైని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అద్భుతమైన గూగ్లీ’’ అంటూ ఒక యూజర్ మెచ్చుకోగా.. సూపర్ రిప్లై అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
That’s a ‘Silly Point’, Sir. It is time to take ‘Extra Cover’. Also, #DelhiPolice is good at ‘Catching’. https://t.co/tTPyrt4F5H
— Delhi Police (@DelhiPolice) January 7, 2022
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

