ఒక ఇంట్లో పెంచుకుంటున్న ఆడ శునకాన్ని కలిసేందుకు ఒక వీధి కుక్క తరచుగా వస్తోంది. అలా రావడం ఆ ఇంటి యజమానికి అస్సలు నచ్చడం లేదు. దీంతో చూసి చూసి తాజాగా ఆ వీధికుక్కపై విరుచుకుపడ్డాడు. పెద్ద కర్ర తీసుకొచ్చి ఆ కుక్కను చావబాదాడు. చివరకు ఒక పెద్ద రాయి తీసుకొని ఆ కుక్క తలపై బాదాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇక్కడి చార్ షహర్ ప్రాంతంలో బంటి బాయిస్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను ఇంట్లో ఒక ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. తన పెంపుడు కుక్కను కలిసేందుకు ఇటీవలి కాలంలో ఒక వీధి కుక్క రావడం అతను గమనించాడు. దాన్ని చూసినప్పుడల్లా తరిమేస్తున్నా ఆ కుక్క ఆగడం లేదు.
తరచూ తన పెంపుడు కుక్క కోసం ఇంటికి వస్తోంది. బుధవారం నాడు తనతోపాటు మరో రెండు వీధి కుక్కలను తీసుకొచ్చింది. ఇది చూసిన బంటి ఆగ్రహంతో ఊగిపోయాడు. పెద్ద కర్ర తీసుకొని అత్యంత కిరాతకంగా ఆ వీధికుక్కపై దాడి చేశాడు.
అతన్నుంచి పారిపోయే క్రమంలో మరో కుక్కకు తగిలి కింద పడిన.. ఆ శునకాన్ని చాలా గట్టిగా కొట్టడంతో అది చలనం లేకుండా పడిపోయింది. అప్పటికీ ఆగ్రహం తీరకపోవడంతో పెద్ద రాయి తీసుకొని ఆ వీధికుక్క తల పగల గొట్టాడు బంటి. ఇదంతా దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జంతు ప్రేమికులు రంగంలోకి దిగారు. బంటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#Watch: A man in #Gwalior beats a male stray dog to death as the stray dog used to play with the man's female pet dog, video of this incident has gone viral. #News #Dogs #DogsOfTwitter #Animals @PetaIndia #MadhyaPradesh #MadhyaPradeshNews pic.twitter.com/mJcvm5lafB
— Free Press Journal (@fpjindia) January 6, 2022