న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో ఓ కోతి చేసిన హంగామా వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లే ముందు వానరం బార్ కౌంటర్లో ఫుడ్‌ను తింటూ జ్యూస్ తాగుతూ వీడియోలో కనిపించింది. మంకీ ఎంజాయ్ చేయడాన్ని ప్రయాణీకులు తమ ఫోన్లలో రికార్డు చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికలపై తెగ వైరలయ్యాయి. విమానాశ్రయంలో వీఐపీ గెస్ట్ వచ్చాడని కొందరు ఈ వీడియోపై కామెంట్ చేయగా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో ట్రీట్‌ను వానరం ఎంజాయ్ చేస్తున్నట్టు మరో నెటిజన్ కామెంట్ చేశారు. క్రెడిట్ కార్డు స్వైప్ చేయలేదా అని మరో యూజర్ అడిగాడు. కాగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటనను విమానాశ్రయం వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఏ తేదీన ఏ సమయంలో ఇది జరిగిందనే వివరాలు వెల్లడికాలేదు.