జిమ్నాస్టిక్స్ చేస్తున్న క్రీడాకారులను అలా కళ్లప్పగించి చూస్తుండిపోతుంటాం. అంతగా వారి విన్యాసాలు మనల్ని కట్టిపడేస్తుంటాయి. అందులో చిన్న పిల్లలు జిమ్నాస్టిక్స్ చేస్తుంటే… మనల్ని మనమే మరిచిపోతుంటాం. అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తున్నది. ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్ (Girl’s Gymnastics) మనల్ని విస్మయానికి గురిచేస్తున్నది.
జిమ్నాస్టిక్స్ చేయాలంటే శరీరాన్ని విల్లులా వంచాలి. ఎటువైపు అంటే అటువైపు, ఎలా అంటే అలా వంచుతూ తిప్పుతుండాలి. నిమిషం 11 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఓ చిన్నారి రకరకాల జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటే అలాగే చూస్తుండి పోవడం మన వంతవుతుంది. ఒకదాని తర్వాత మరో తీరులో శరీరాన్ని వంచుతూ ఎంతో నేర్పరి మాదిరిగా చేస్తున్న జిమ్నాస్టిక్స్ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఐదారు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో 49 లక్షల వ్యూస్‌ను పొందింది. అలాగే, 96 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
రొమేనియాకు చెందిన రిటైర్డ్ జిమ్నాస్ట్, ఐదుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నదియా కొమనేసి దృష్టిని కూడా ఈ వీడియో ఆకర్షించింది. ‘వావ్.. గొప్ప టాలెంట్.. ప్రశాంతత.. ఫ్లెక్సిబిలిటీ’ అని ఆమె వీడియోను రీట్వీట్ చేస్తూ రాసింది.
This is INSANE!
— Ann is still European 🌍 (@56blackcat) August 12, 2021
The bit at the end 😱 https://t.co/Vcep9dQ0aT
చట్టసభలకు అంతరాయం కలుగకుండా చూడాలి : వెంకయ్యనాయుడు
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
త్వరలో మళ్లీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
ఆఫ్ఘాన్‌ను తాలిబాన్ ఆక్రమించుకోవడం సబబే: సజ్జాద్ నోమాని
ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..