TajMahal Lookalike | భార్య కోసం తాజ్‌మహల్ వంటి భవనం కట్టిన భర్త.. ఎక్కడంటే
Tajmahal Lookalike | భార్యపై అమితమైన ప్రేమతో ఒక వ్యక్తి తాజ్‌మహల్ వంటి కట్టడం నిర్మించాడు. దాన్ని భార్యకు బహుమతిగా అందించాడు. ఆనందర్ ప్రకాష్ ఛోక్సీ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని బుఢాన్పూర్లో ఉంటున్నాడు

బుఢాన్పూర్: భార్యపై అమితమైన ప్రేమతో ఒక వ్యక్తి తాజ్‌మహల్ వంటి కట్టడం నిర్మించాడు. దాన్ని భార్యకు బహుమతిగా అందించాడు. ఆనందర్ ప్రకాష్ ఛోక్సీ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని బుఢాన్పూర్లో ఉంటున్నాడు. అతనికి తాజ్‌మహల్ అంటే చాలా ఇష్టం. షాజహాన్ భార్య ముంతాజ్ చనిపోయింది మధ్యప్రదేశ్‌లో అయితే.. తాజ్‌మహల్ ఆగ్రాలో ఎందుకు కట్టారని అతను చాలాసార్లు అనుకున్నాడట.
అందుకే తన భార్య కోసం తాజ్‌మహల్ వంటి ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఇంజనీరును పిలిపించి తన కోరిక చెప్పాడు. దానికి సరేనన్న ఆ ఇంజనీరు తాజ్‌మహల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఒక డిజైన్ తయారుచేశాడు. పశ్చిమబెంగాల్, ఇండోర్ నుంచి శిల్పులను తెప్పించి ఆ భవనం లోపల డిజైన్ చేయించారు. ముప్ఫై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది.
భవనంలో ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌ను ముంబైలోని పనివాళ్లు తయారుచేశారట. ఒక పెద్ద హాలు, కింది అంతస్థులో రెండు బెడ్రూంలు, పైఅంతస్థులో రెండు బెడ్రూలు, ఒక లైబ్రరీ, ఒక మెడిటేషన్ గది ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. చీకట్లో ఒరిజినల్ తాజ్‌మహల్ మెరిసినట్లే వెలుగులు విరజిమ్మేలా ఈ భవనంలో లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, షాజహాన్ భార్య ముంతాజ్ మహల్.. బుఢాన్పూర్లోనే 14వ బిడ్డకు జన్మనిస్తూ కన్నుమూసింది.
#MadhyaPradesh | #Burhanpur resident Anand Prakash Chouksey builds a Taj Mahal-like 4 bedroom house, gifts it to his wife. pic.twitter.com/O3vusGPGhO
— SALIM.AJMERI (@SalimAjmeri_) November 22, 2021
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

