పిన్‌బాల్ గేమ్ గురించి తెలుసు కదా. పిన్‌బాల్ గేమ్ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. పిన్‌బాల్ మిషన్‌లో ఉండే బాల్‌తో ఓ ఆడుకుంటారు పిల్లలు. బాల్ కిందికి రాగానే.. దాన్ని పైకి వెళ్లేలా చేయడం.. ఆ తర్వాత ఆ బాల్ పైకి వెళ్లి అటూ ఇటూ తిరిగి.. చివరకు కిందికి రావడం.. చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకే.. పిన్‌బాల్ గేమ్‌ను పిల్లలు ఎంతో ఇష్టంతో ఆడుతుంటారు. పాత కంప్యూటర్లలో గేమ్స్ ఆడిన ఈ తరం వాళ్లకు కూడా పిన్‌బాల్ గేమ్ గురించి తెలుసు.

ఒకవేళ ఆ బాల్ ప్లేస్‌లో మనిషి ఉంటే ఏమౌతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మో.. మనిషి.. బాల్లా ఎగిరి గంతేయగలడా? అటూ ఇటూ దూకగలడా? అంటారా? ఎస్.. అచ్చం పిన్బాల్లా వ్యవహరించే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు పవెల్ పాషా పెట్కున్స్. కానీ.. అతడిని అందరూ హ్యూమన్ పిన్‌బాల్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. పిన్‌బాల్ గేమ్‌లో అతడే బాల్ అన్నమాట.
దాని కోసమే లండన్‌లో పెద్ద పిన్‌బాల్ మిషన్‌ను క్రియేట్ చేశాడు. ఆ పిన్‌బాల్ మిషిన్ బరువు ఎంతుంటుందో తెలుసా? 23 టన్నులు. 20 మీటర్ల పొడవుతో 45 డిగ్రీల కోణంలో పైకి నిటారుగా ఉంటుంది ఈ మిషన్. పెట్కున్స్కు ఈ ప్రపంచమే పెద్ద ప్లేగ్రౌండ్. ఫ్రీరనర్స్ స్పోర్ట్‌లో ఇతడు దిట్ట. ఈ స్పోర్ట్‌లో భాగంగా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్, బ్రేక్ డ్యాన్స్ మూవ్స్ చేస్తుంటారు. అందుకే తన ప్లే ఏరియాలోనే అన్ని రకాల గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే.. థ్రిల్ కోసం పెద్ద పిన్‌బాల్ మిషన్‌ను ఏర్పాటు చేశాడు. దానికి పిన్‌బాల్ అతడే అయ్యాడు.
కింద ఉన్న బంపర్స్ అతడిని పైకి బౌన్స్ చేస్తాయి. దీంతో బాల్ పైకి వెళ్లి కింద అక్కడున్న వాటిని తాకుతూ కిందపడ్డట్టుగా పెట్కున్స్ అటూ ఇటూ గెంతుతాడు. సాధారణంగా పిన్‌బాల్ టేబుల్స్‌లో ఉన్నట్టుగానే.. తన పిన్‌బాల్ థీమ్‌లో వరల్డ్ లాండ్‌మార్క్స్, ఈఫిల్ టవర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మాయన్ పిరమిడ్, అలాగే స్లైడింగ్, ఫ్లిప్పింగ్, స్పిన్నింగ్ లాంటి స్టంట్స్ చేసే విధంగా అన్ని ఏర్పాటు చేసి.. దాని డెమోను కూడా ఇచ్చాడు. అచ్చం పిన్‌బాల్ తిరిగినట్టే.. పెట్కున్స్ ఎలా హ్యుమన్ పిన్‌బాల్ అయ్యాడో ఈ వీడియోలో చూడండి.
‘It’s so much bigger and so much scarier than anybody really expected’ — This human pinball machine is the biggest freerunning set in history 👀 pic.twitter.com/ESQWlhJqWZ
— NowThis (@nowthisnews) September 15, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?
రూ 25 కోట్లు పలకనున్న అరుదైన కళ్లజోళ్లు!