న్యూఢిల్లీ : అలిసిన శరీరం పునరుత్తేజితమయ్యేందుకు కంటి నిండా నిద్ర పోవడం ఎంతో అవసరం. శరీరం, మెదడుకు విశ్రాంతి ఇవ్వాలంటే కనీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢనిద్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో శరీరం, మెదడుకు తగినంత విశ్రాంతి లేకుంటే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమం ఎంత అవసరమో తగినంత నిద్ర అంతే ప్రధానం. చాలినంత నిద్ర లేకుంటే మెదడు సరైన విధంగా పనిచేయడంపై ప్రభావం చూపడంతో పాటు ఒత్తిడి ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇక నిద్రలేమిని నివారించి కంటి నిండా కునుకు తీసేందుకు ఈ నాలుగు చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొబైల్, ల్యాప్టాప్ల వంటి బ్లూలైట్కు దూరం
రాత్రి వేళ కాఫీలు, టీలకు బ్రేక్
నిద్రకు సరైన సమయం కేటాయించాలి
పగటి వేళ నిద్రకు చెక్