హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-విజయవా డ జాతీయ రహదారిని త్వరలోనే 6+2 లేన్లుగా విస్తరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. విస్తరణ అంశాన్ని కేంద్రమంత్రి గడరీ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. మంగళవారం గుజరాత్లోని ఎక్తానగర్లో జరిగిన ‘చింతన్ శివిర్ 2026’ సదస్సులో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న 250-300 మందికి 15 రోజుల్లో ఉ ద్యోగాలు కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మారు పేర్లతో పనిచేస్తున్న వారిపై ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన నివేది క ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మంగళవారం జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. కరోనా సమయంలో ఉద్యోగాలు కో ల్పోయిన డిస్మిస్డ్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): వానకాలంలో రాష్ట్ర యాప్ ద్వారా 33.39 లక్షల మంది రైతులకు 128.18 లక్షల యూరియా బస్తాలు, కేంద్ర యాప్ ద్వారా 37.48 లక్షల మంది రైతులకు 104.99 లక్షల ఎరువుల బస్తాలు పంపిణీ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఎరువుల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ముందుగానే ఎరువుల అడ్వాన్స్ పొజిషనింగ్.. షిప్ యా ర్డుల్లో ప్రత్యేక అధికారుల నియామ కం చేపట్టినట్టు వెల్లడించారు. ఫార్మర్స్ రిజిస్ట్రీలో తెలంగాణ ముందంజలో ఉన్నదన్నారు.