e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News పొట్టి భ‌ర్త పొడ‌గ‌రి భార్య‌: వ‌ర‌ల్డ్‌ రికార్డును చెరిపేశారు

పొట్టి భ‌ర్త పొడ‌గ‌రి భార్య‌: వ‌ర‌ల్డ్‌ రికార్డును చెరిపేశారు

పొట్టి భ‌ర్త పొడ‌గ‌రి భార్య‌: వ‌ర‌ల్డ్‌ రికార్డును చెరిపేశారు

లండ‌న్ : హైట్ అనేది త‌మ‌కు ఓ అంకె మాత్ర‌మే అంటూ ఎత్తులో ఇద్ద‌రి మ‌ధ్యా దాదాపు రెండు అడుగుల వ్య‌త్యాసం ఉన్నాఓ బ్రిటిష్ జంటకు లంకె కుదిరింది. ఎత్తు వ్య‌త్యాసం ప‌క్క‌న‌పెట్టి 2016లో వీరు ఒక్క‌టి కావ‌డంతో అత్య‌ధికంగా ఎత్తు వ్య‌త్యాసం ఉన్న వైవాహిక బంధంలో అడుగిడిన జంట‌గా వీరు పాత రికార్డుకు పాత‌రేసి గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డుకెక్కారు. భ‌ర్త కంటే భార్య రెండు అడుగుల పొడ‌వు అధికంగా ఉన్నారు. జేమ్స్ మూడడుగుల ఏడు అంగుళాల ఎత్తు ఉండ‌గా, చోలె ల‌స్టెడ్ ఐదడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉన్నారు. పెండ్ల‌యిన జంట‌ల్లో అత్య‌ధిక ఎత్తు వ్య‌త్యాసం ఉన్న జంట‌గా జూన్ 2న వీరు గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించారు.

జేమ్స్‌కు అరుదైన డ‌యాస్ట్రోఫిక్ డిప్లేసియా ఉండ‌టంతో అది ఎముక‌లు, కార్టిలేజ్ ఎదుగుద‌ల‌ను అడ్డ‌కుంది. మూడడుగుల ఏడు అంగుళాల ఎత్తుతో కొన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా తాను ఇత‌రులు చేసే ప‌నులన్నీ కాస్త భిన్నంగా చేస్తాన‌ని జేమ్స్ ధీమాగా చెపుతున్నాడు. తన‌కు ఎత్తు ఎక్కువ ఉండేవారంటే ఇష్ట‌మైనా 2012లో జేమ్స్‌ను క‌లుసుకున్న త‌ర్వాత త‌న అభిప్రాయం మారింద‌ని చోలె పేర్కొంది. ఇత‌రులు త‌మ గురించి ఎలా అనుకుంటారా అనేది ప‌క్క‌నపెట్టి తాము ఒక్క‌ట‌య్యామ‌ని ఆమె గుర్తుచేసుకుంది. ఐదేండ్ల కింద‌ట ఏడ‌డుగులు వేసిన ఈ జంట‌కు ప్ర‌స్తుతం ఒలివియా పేరుతో రెండేండ్ల కుమార్తె ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొట్టి భ‌ర్త పొడ‌గ‌రి భార్య‌: వ‌ర‌ల్డ్‌ రికార్డును చెరిపేశారు
పొట్టి భ‌ర్త పొడ‌గ‌రి భార్య‌: వ‌ర‌ల్డ్‌ రికార్డును చెరిపేశారు
పొట్టి భ‌ర్త పొడ‌గ‌రి భార్య‌: వ‌ర‌ల్డ్‌ రికార్డును చెరిపేశారు

ట్రెండింగ్‌

Advertisement